నవరాత్రి ఉపవాసాలు

శరన్నవరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఇంటింటా సంబురాలే. చాలామంది పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. అయితే ఖాళీ కడుపుతో ఉంటూ, తోచింది తింటూ కూర్చుంటే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. కొన్ని ఆహార నియమాలను పాటిస్తే, ప్రశాంత చిత్తంతో అమ్మవారిని కొలుచుకోవచ్చు.
- ఉపవాస సమయంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. సలాడ్స్ లేదా సూప్స్‌తో తగినంత శక్తి వస్తుంది. కూరగాయల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
- రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. కాబట్టి, రోజు మొత్తంలో మూడు, నాలుగుసార్లు చిన్నచిన్న
- ఫలహారాలు తీసుకోవాలి.
- వీలైనన్ని ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. ఉదాహరణకు శరీర బరువులోని ఒక్కో కిలోకు, రోజుకు 35 మిల్లీ లీటర్ల చొప్పున ద్రవ పదార్థాలు అవసరం. మంచినీళ్లతో పాటు కొబ్బరినీళ్లు, నిమ్మరసం, కూరగాయల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. లేదంటే ఆకలి పెరుగుతుంది, శరీరం అలసిపోతుంది. గ్రీన్ టీ కూడా తాగొచ్చు.
- ఉపవాసం చేస్తున్నాం కదా అని, ఒక్కచోటే కూర్చోవడమో, పడక దిగకుండా నిద్రపోవడమో సరికాదు. చిన్నచిన్న పనులు చేస్తూ హుషారుగా గడపాలి.
- దేవుడి ప్రసాదమని నూనె, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉండే వంటకాలను తినకూడదు. పకోడీలు, పూరీలు మొదలైనవాటికి బదులుగా సాబుదానా పాయసం లేదా కిచిడి, ఉడికించిన మొరంగడ్డ, ఆలుగడ్డ తినాలి. ఉపవాసం వల్ల ఒంట్లో నీరసంగా ఉందని చెప్పి, బయటి పదార్థాలను తెప్పించుకోవద్దు. ఇంటి వంటకే ప్రాధాన్యమివ్వాలి.
- కొవ్వు ఎక్కువగా ఉండే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా లో ఫ్యాట్ మిల్క్, లో ఫ్యాట్ చీజ్, పెరుగు తీసుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

