తరలివచ్చిన వసంతం!

పచ్చని ఆకులు, రంగుల పూలు, ఎగిరే పక్షులు, పారే సెలయేళ్లు.. ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే. ఆ అందాలను దుస్తులపై తీర్చిదిద్దుతూ ఫ్యాషన్లకు కొత్త శోభ తెస్తున్నారు డిజైనర్లు. సంస్కృతి, సంప్రదాయంతోపాటు సహజ సౌందర్యాన్నీ మేళవించిన బ్లౌజ్ డిజైన్లేమిటో చూద్దాం..
పూల సొగసుతో..
పింక్ కలర్ ప్యూర్ టస్సర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన బ్లౌజ్ ఇది. వీపు భాగంలో రంగురంగుల పూలతో మల్టీకలర్ త్రెడ్ మగ్గం వర్క్ హైలైట్ అయ్యింది. ట్రెండీలుక్ కోసం హైక్లోజ్డ్ నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చి హాఫ్ ఇంచ్ ఫ్లీట్స్ జతచేశారు. గోల్డ్ జరీ బార్డర్ ఉన్న టస్సర్ పట్టుచీరకు ఈ బ్లౌజ్ చక్కగా నప్పింది. బ్లౌజ్‌కు కాంట్రాస్ట్‌గా హాఫ్ ఇంచ్ పింక్ బార్డర్ జతచేశారు.సహజమైన రంగులతో చీరంతా వేసిన హ్యాండ్ ప్రింట్ ఆకులు, పూలు అదనపు ఆకర్షణ.
సంస్కృతి ఉట్టిపడేలా..
మెరూన్ కలర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. భోగిమంటలు, చెరుకుగడలు, పతంగులు, బసవన్నలతో మన సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి థీమ్‌తో మగ్గం వర్క్ చేశారు. సంప్రదాయానికి కాస్త ట్రెండ్‌ను మేళవించి పఫ్ హ్యాండ్స్ ఇస్తూ.. ఫ్లీట్స్తో పట్టీ జతచేశారు. టస్సర్ పట్టు ఫ్యాబ్రిక్‌పై బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్ చేసిన చీర ఈ బ్లౌజ్‌కి చక్కగా నప్పింది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

