గెలుపు దారి చూపే పాలపిట్ట

‘దశాహోరాత్రమ్’ అనేదే దసరాగా మారింది. జగన్మాత విజయ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురునితో పోరాడి మట్టుపెట్టిన పదో రోజును విజయానికి సంకేతంగా.. వేడుకగా దసరాను జరుపుకొంటున్నాం. అదే సమస్త విజయాలకు ఆనవాలుగా విజయదశమిగా మారింది. శ్రీరాముడు విజయ దశమి రోజున అపరాజితాదేవిని పూజించి, పాలపిట్టను దర్శించి రావణ సంహారానికి వెళ్లాడనీ, విజయోత్సాహంతో తిరిగి వచ్చాడనీ జానపదుల విశ్వాసం. అజ్ఞాతవాసం ముగించుకున్న పాండవులు విజయదుర్గా స్వరూపిణిగా భావించే జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసి వెళ్తుండగా వాళ్లకు పాలపిట్ట దర్శనం ఇచ్చిందనీ, అందుకే వారు కౌరవులను జయించారన్న కథ ప్రచారంలో ఉంది. అయితే, రామాయణ, మహాభారత కావ్యాల్లో మాత్రం పాలపిట్ట ప్రస్తావన కనిపించదు. కానీ, దసరా రోజున ఊరికి ఈశాన్య భాగంలో విజయదుర్గా స్వరూపిణిగా భావించే జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసి, సీమోల్లంఘనం అంటే ఊరి సరిహద్దును దాటాలని ధర్మ శాస్త్రం చెబుతున్నది. ఆ సమయంలో పాలపిట్టను దర్శించుకుంటే సకల శుభాలు, సమస్త విజయాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే, పాలపిట్ట దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు. అది క్రమంగా ఒక సంప్రదాయంగా మారింది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాగల రెండు రోజులు వర్ష సూచన
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

