పిలల్లో జ్వరానికి జంకొద్దు.. ఇలా చేయండి..
పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తరచుగా ఆందోళన చెందే విషయాలలో జ్వరం ఒకటి. పెద్దలకు తలనొప్పి ఎంత తరచుగా వస్తుందో, పిల్లలకు జ్వరం అలా వస్తుంటుంది. ఇది ఎక్కువగా రాత్రి సమయాలలో ప్రారంభమై అప్పుడప్పుడు తల్లిదండ్రులను నిస్సహాయుల్ని చేస్తుంది. పిల్లలకు వ్యాధి సోకినప్పుడు వ్యాధి కారకాలతో తలపడి తమను తాము రక్షించుకొనే
పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తరచుగా ఆందోళన చెందే విషయాలలో జ్వరం ఒకటి. పెద్దలకు తలనొప్పి ఎంత తరచుగా వస్తుందో, పిల్లలకు జ్వరం అలా వస్తుంటుంది. ఇది ఎక్కువగా రాత్రి సమయాలలో ప్రారంభమై అప్పుడప్పుడు తల్లిదండ్రులను నిస్సహాయుల్ని చేస్తుంది. పిల్లలకు వ్యాధి సోకినప్పుడు వ్యాధి కారకాలతో తలపడి తమను తాము రక్షించుకొనే ప్రయత్నంలో కనిపించే ఒక చిహ్నమే జ్వరం.
లక్షణాలు
- జ్వరం వచ్చే ముందు నుదురు వేడెక్కి ముఖం, కళ్లు ఎర్రబడతాయి.
- కొన్నిసార్లు ముఖ్యంగా మలేరియా, వైరల్ జ్వరాల లాంటి వాటిలో చలి, వణకడం కనిపిస్తుంది.
- మరీ చిన్నపిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు తల… మిగతా శరీర భాగాల కన్నా వేడిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జ్వరంలో కూడా కాళ్లు, చేతులు చల్లగా ఉండవచ్చు.
- ఉదయం పూట శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. మధ్యాహ్నం, సాయంత్రం జ్వరం తీవ్రత పెరగవచ్చు.
ఇలా చేయండి..
- స్వెటర్లు, తలకు క్యాప్ లాంటివి వేయకూడదు. సన్నటి వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి. పసిపిల్లలకు న్యాప్కిన్ సరిపోతుంది.
- తడి వస్త్రంతో శరీరం అంతా తుడవాలి. ముఖ్యంగా మెడ, చంకలు, గజ్జలలో తుడవడం అవసరం. కేవలం నుదురుపై తడి వస్త్రం ఉంచడం వల్ల ఉపయోగం లేదు. అలాగని మరీ చల్లటి నీటిని ఉపయోగించకూడదు. దీనివల్ల వణుకు పుడుతుంది. పిల్లలు వణుకుతుంటే తుడవడం ఆపేయాలి. తడి ఆరిన కొద్దీ తుడుస్తూ ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెంటిగ్రేట్ రాగానే ఆపేయాలి.
- జ్వరానికి పారాసిటమాల్ మందు డాక్టర్లు సూచించిన మోతాదు ఇవ్వాలి. మందు వేసిన వెంటనే వాంతి చేసుకుంటే తిరిగి ఇవ్వాలి.
- జ్వరంతో ఉన్నపిల్లలకు వారికి ఇష్టమైన ఆహారం ఏదైనా ఇవ్వొచ్చు. ముఖ్యంగా రాగి జావ, కొబ్బరి నీళ్లు, పండ్లు ఇవ్వాలి. ఆహారం తినిపించకపోతే మరింత నీరసం అవుతారు. తరచూ నీళ్లు తాగించాలి.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

