Fish | మనుషులు వెల్లకిలా ఈదడం చూసే ఉంటారు, కానీ వెల్లకిలా ఈత కొట్టే చేపలను ఎప్పుడైనా చూశారా? ఫొటోలో కనిపిస్తున్నది అలాంటి వింత చేపలే. మనం అక్వేరియంలో పెంచుకునే క్యాట్‌ఫిష్ జాతికి చెందినవే ఇవి. నీళ్లలో తలకిందులుగా ఈత కొట్టడం వీటి ప్రత్యేకత. అందుకే వీటిని ‘అప్‌సైడ్ డౌన్ క్యాట్‌ఫిష్’ అని పిలుస్తారు. ఈదేందుకూ, కావలసిన దిశలో కదిలేందుకూ సహకరించే స్విమ్ బ్లాడర్ నిర్మాణం వీటిలో భిన్నంగా ఉంటుంది. ఆ కారణంగానే ఇవి తలకిందులుగా ఈదుతాయి. ఎక్కువగా సముద్రాల్లో జీవించే అప్‌సైడ్ డౌన్ క్యాట్‌ఫిష్‌ను అక్వేరియంలోనూ పెంచుకోవచ్చు. దాదాపు 4వేల సంవత్సరాల నాటి ఈజిప్టు పిరమిడ్ల మీద కూడా వీటి బొమ్మలు ఉన్నాయట.