కొత్త అవతారం!
దియామీర్జా అనగానే.. నటి, ఆంత్రప్రెన్యూర్, మాడల్, ప్రొడ్యూసర్.. మొదలైన కిరీటాలే గుర్తుకొస్తాయి. తాజాగా ఆమె వీటన్నిటికంటే అమూల్యమైన హోదాను సొంతం చేసుకున్నారు. ‘అమ్మ’ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా మాతృత్వం గురించి తన మనసులోని భావాలు పంచుకున్నారు.
దియామీర్జా అనగానే.. నటి, ఆంత్రప్రెన్యూర్, మాడల్, ప్రొడ్యూసర్.. మొదలైన కిరీటాలే గుర్తుకొస్తాయి. తాజాగా ఆమె
వీటన్నిటికంటే అమూల్యమైన హోదాను సొంతం చేసుకున్నారు. ‘అమ్మ’ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా మాతృత్వం గురించి తన మనసులోని భావాలు పంచుకున్నారు.
కొత్తగా మాతృత్వాన్ని పొందినవారికి నా సలహా ఒకటే. దయచేసి మొహమాటపడకండి. ఎవరేం అనుకుంటారో అని భయపడిపోకండి. అవసరమైతే ఎవరిసాయమైనా తీసుకోండి. ఒత్తిడి పెంచుకోకండి.
పిల్లల్ని ఫలానా పద్ధతిలోనే పెంచాలన్న నియమం ఎక్కడా లేదు. మీ మనసు చెప్పిన మార్గంలోనే వెళ్లండి. ఇతరులతో పోలిక వద్దు. మీ పసిబిడ్డతో ఆనందంగా కాలక్షేపం చేయండి.
నా బిడ్డ అవ్యాన్.. నా జీవితాన్నే మార్చేశాడు. ఇప్పుడు నా ప్రపంచం వాడే. నేను పర్యావరణ ప్రేమికురాలిని. బిడ్డను ఎంతగా ప్రేమిస్తానో, ప్రకృతినీ అంతే ఆరాధిస్తాను. కాబట్టే, తన డైపర్స్ నుంచి బొమ్మల వరకూ.. ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులనే ఎంచుకుంటున్నా.
పిల్లలు పెరిగి పెద్దవుతున్నకొద్దీ వాళ్లకు బాధ్యత నేర్పండి. సమాజాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో వివరించండి. ఇది కూడా పిల్లల పెంపకంలో ఓ భాగమే.
పిల్లలు లేలేత పూలలాంటి వాళ్లు. మాటలతోనో, చేతలతోనో చిన్నబుచ్చకండి. వయసు చిన్నదేకావచ్చు. కానీ వాళ్ల ఆలోచనలను గౌరవించండి. వాళ్లలోని కుతూహలాన్ని తొక్కిపడేయకండి. బిడ్డను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్ర కీలకం. అమ్మ తర్వాతే ఎవరైనా.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

