పెరుగుదల, కండరాల పునర్నిర్మాణం, కొవ్వు నిల్వల నిర్వహణ, మెదడు పనితీరు… ఇవన్నీ గాఢనిద్రతో ముడిపడి ఉన్నాయని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేటతెల్లమైంది. గాఢనిద్రకు అనుసంధానమై పనిచేసే బ్రెయిన్ సర్క్యూట్ని వీళ్లు కనుగొన్నారు. పెరుగుదల హార్మోన్ల ఉత్పత్తికి సహకరించే నాడీ కణాలు మెదడులోని హైపోథలామస్లో బాగా అంతర్గతంగా ఉంటాయి. గాఢనిద్రలో ఇవి రకరకాల న్యూరాన్లతో అనుసంధానమయ్యే ప్రక్రియ శారీరక, మానసిక అంశాలెన్నిటినో ప్రభావితం చేసే మార్పులకు కారణం అవుతాయి.
మెలకువ, సంసిద్ధత, ఆలోచనలాంటివన్నీ ఈ ప్రక్రియకు సంబంధించినవే. అయితే చక్రంలాగా జరిగే ఈ న్యూరల్ సర్యూట్ని అర్థం చేసుకోవడం ద్వారా హార్మోనల్ థెరపీలను మెరుగు పరుస్తూ నిద్ర సమస్యలను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్లాంటి వ్యాధుల నివారణ, చికిత్సకూ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శరీరం చక్కగా పెరిగేందుకు టీనేజర్లకు నిద్ర అత్యంత అవసరం అన్నమాట.