సీతాఫలంతో ఆరోగ్యానికి మేలు
మధుర ఫలం.. సీతాఫలం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దొరికే ఈ పండు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహ రోగులు తినకూడదని చెబుతారు. క్యాలరీలు ఎక్కువ కాబట్టి, డైటింగ్‌లో ఉన్నవాళ్లు ముట్టుకోవద్దనీ అంటారు. అయితే ఈ రెండు వాదనలూ అర్ధ సత్యాలేనని నిపుణులు నిర్ధారిస్తున్నారు
Sugar Apple | మధుర ఫలం.. సీతాఫలం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దొరికే ఈ పండు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహ రోగులు తినకూడదని చెబుతారు. క్యాలరీలు ఎక్కువ కాబట్టి, డైటింగ్‌లో ఉన్నవాళ్లు ముట్టుకోవద్దనీ అంటారు. అయితే ఈ రెండు వాదనలూ అర్ధ సత్యాలేనని నిపుణులు నిర్ధారిస్తున్నారు. కాకపోతే, అతి సర్వత్ర వర్జయేత్ నిబంధన ఈ ఫలానికీ వర్తిస్తుంది.
› సీతాఫలంలో పుష్కలంగా దొరికే సోడియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఓ చిన్న సీతాఫలంలోనే రోజువారీగా తీసుకోవాల్సిన మెగ్నీషియంలో పదిశాతం దొరుకుతుంది. మెగ్నీషియం గుండె కండరాలకు సాంత్వన చేకూర్చి, హృద్రోగాల నుంచి కాపాడుతుంది.
› ఈ పండు తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే, సీతాఫలం జీర్ణం అవుతున్న సమయంలోనూ.. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్టుండి పెరగవన్నమాట. ఇందులోని పాలీఫినాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, గ్లూకోజ్‌ను తగ్గించేందుకు సాయపడతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా ఆస్వాదించవచ్చు.
› ఇందులోని విటమిన్-సి, రిబోఫ్లేవిన్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కొన్ని రకాల కణుతులు, క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి.
› ఈ ఫలంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, ఎసిడిటీలను
నియంత్రిస్తాయి.
› సీతాఫలంలో పీచు పదార్థం ఎక్కువ. అందుకే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ శాతం సున్నా. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవాళ్లు కూడా నిశ్చింతగా తినొచ్చు.
› ఇందులో అధిక మోతాదులో లభించే ఐరన్ పీసీఓఎస్ నియంత్రణలో సాయపడుతుంది. అలసట, చికాకులు తగ్గించి, సంతాన సాఫల్యతను పెంచుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

