దేవతల తృప్తి కోసం..
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ గ్రామదేవతలు తమను కాపాడుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు ఊళ్లోకి ఏ దుష్టశక్తులూ రాకుండా కాపుకాస్తారని నమ్ముతారు
గ్రామదేవతల ఆలయానికి వెళ్లినప్పుడు జంట (రెండు) కొబ్బరికాయలు కొట్టాలని అంటారు? దీనికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉన్నదా! ఒక్క కొబ్బరికాయ కొడితే దోషమా?
– సుకన్య, భువనగిరి
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ గ్రామదేవతలు తమను కాపాడుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు ఊళ్లోకి ఏ దుష్టశక్తులూ రాకుండా కాపుకాస్తారని నమ్ముతారు. అందుకే, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గ్రామదేవతలను పూజించే సంప్రదాయం ఉన్నది. అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు రెండు కొబ్బరికాయలు కొట్టే ఆచారం ఉంది.
సహజంగా గ్రామదేవతలు ఉగ్రమూర్తులు. ఈ దేవతలు ఎక్కువ దాహం, ఆకలి కలిగి ఉంటారని భావిస్తారు. అందుకే మద్య, మాంసాదులను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తుంటారు. కొబ్బరికాయ విషయానికి వస్తే, ఆ దేవతలను తృప్తి పరచాలనే భావనతో రెండు కాయలను కొట్టి నైవేద్యం పెడతారు. అయితే, ఒక్క కొబ్బరికాయ కొట్టినా దోషం కాదు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

