Curd | పెరుగుకూ సీనుంది!
ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ యుగం. అందులో అందంగా కనిపిస్తేనే, ఉత్పత్తి నలుగురినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దుస్తులు, యాక్సెసరీల్లోనే కాదు ఫుడ్ విషయంలోనూ ఇదే ఫ్యాషన్ అయిపోయింది.
Curd | ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ యుగం. అందులో అందంగా కనిపిస్తేనే, ఉత్పత్తి నలుగురినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. దుస్తులు, యాక్సెసరీల్లోనే కాదు ఫుడ్ విషయంలోనూ ఇదే ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఆహారాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు తమ క్రియేటివిటీ అంతటినీ వినియోగిస్తున్నారు తయారీదారులు.
అవీ ఇవీ అని కాదు, చివరికి పెరుగు తోబుట్టువు అయిన యోగర్ట్నూ ఇలాగే ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇక్కడి గ్లాసుల్లో సీనరీని తలపిస్తున్న పదార్థం యోగర్టే. పండ్ల ముక్కలు, గింజలు, కొన్ని రకాల జూసుల్ని కలిపి వీటిని ఇలా సీనరీని తలపించేలా రూపొందిస్తున్నది చైనాకు చెందిన బ్లూగ్లాస్ అనే ఆహారోత్పత్తి సంస్థ.
ఇందులోని రంగుల కోసం అవకాడో, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలాంటి రకరకాల పండ్లను వాడుతున్నది. చూస్తుంటే తమకిష్టమైన విండోస్వాల్ పేపర్లా ఉందని, దాన్ని చటుక్కున తాగేసే అవకాశం ఇది అనీ… నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రొబయాటిక్గా పనికొస్తూ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడే యోగర్ట్కి ఇప్పుడు అభిమానులు పెరిగిపోవడంతో, వారిని ఆకట్టుకోవడానికి తాము ఇలా సీనరీని పోలిన అలంకారం చేస్తున్నామని సదరు సంస్థ చెబుతున్నది. ఆరోగ్యం – అందం ఒకే గ్లాసులో ఉన్నాయన్నమాట!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

