సొమ్ములు పెట్టుకోగానే చక్కదనం రాదు. ఏ నగ ఎలా అలంకరించుకోవాలి? అవి మనకెలా నప్పుతాయి? అనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతం సంప్రదాయ జువెలరీదే హవా అని చెబుతున్నది సెలెబ్రిటీ డిజైనర్ నీతీసింగ్. విద్యాబాలన్, ట్వింకిల్ ఖన్నా, అదితీరావ్ హైదరీ తదితర బాలీవుడ్ ముద్దుగుమ్మలకు తను జువెలరీ డిజైనర్. విద్యాబాలన్ ధరించే పొడవైన స్మార్ట్ నెక్‌పీస్ వంటి సంప్రదాయ జువెలరీ అయినా, పొరలుగా కనిపించే ట్వింకిల్ ఖన్నా ఆభరణాలైనా, అదితి ఇష్టపడే సూక్ష్మ ఆభరణాలైనా తనకు ఇష్టమే అని వివరించింది. పాటియాలా, రాజస్థాన్ మహిళలు ధరించే ఆభరణాలకు సమకాలీన డిజైన్‌ను జోడించడం తన ప్రత్యేకత అని చెబుతున్నది నీతి. ఈ సెలెబ్రిటీ డిజైనర్ ఇటీవల బెంగళూరులో ఏర్పాటు చేసిన ఆభరణ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది.