పిల్లలకు తెలిస్తే ఎలా?
నా సమస్య గురించి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ, తప్పని పరిస్థితి. నా వయసు 40 ఏండ్లు. చేతికొచ్చిన కూతుళ్లు ఉన్నారు. మూడేండ్ల క్రితం, తన చిన్ననాటి ప్రియురాలితో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
నా సమస్య గురించి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ, తప్పని పరిస్థితి. నా వయసు 40 ఏండ్లు. చేతికొచ్చిన కూతుళ్లు ఉన్నారు. మూడేండ్ల క్రితం, తన చిన్ననాటి ప్రియురాలితో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నాతో ఉండలేనని తెగేసి చెప్పాడు. దీంతో అతణ్నే పట్టుకొని వేలాడటం ఇష్టంలేక విడాకులు ఇచ్చాను. అతను ధనవంతుడు. మేం సుఖంగా బతికేందుకు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు.
నేను కూడా జాబ్ చేస్తుండటంతో పిల్లలు ఏ లోటూ లేకుండా చదువుకుంటున్నారు. అయితే, ఏడాది క్రితం మా ఆఫీస్‌కు బదిలీపై వచ్చిన ఓ ఉద్యోగి నన్ను ఆకర్షించాడు. అతను నా కంటే పదేండ్లు చిన్నవాడు. స్నేహంతో మొదలైన ఆ బంధం చాలా దూరం వెళ్లింది. మా ఇద్దరి మధ్యా పెండ్లి ప్రస్తావన రాలేదు కానీ, లైంగికంగా దగ్గరయ్యాం. అంతలోనే అతను బదిలీపై మరోచోటుకు వెళ్లాడు. ఆ తర్వాత కూడా ఇంకో ఇద్దరితో సంబంధాలు కొనసాగించాను. ఎందుకిలా ప్రవర్తిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. ఈ విషయం నా కూతుళ్లకు తెలిస్తే.. ఏమవుతుందోననే ఆందోళన మొదలైంది. మనశ్శాంతిగా ఉండలేక పోతున్నాను. మీరే నాకు పరిష్కారం చూపాలి.
– ఓ సోదరి
చిన్న వయసులోనే జీవిత భాగస్వామి దూరమైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమే. మారుతున్న ప్రపంచంలో ఎవరి నిర్ణయాలను వారు స్వేచ్ఛగా తీసుకుంటున్నారు. బిడ్డల భవిష్యత్ కోసం మీరు మీ వ్యక్తిగత ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాలి. మీకంటూ ఓ తోడు అవసరం. ఒకసారి మీ పిల్లలతోనూ చర్చించండి.
సమాజంలో కనిపిస్తున్న ఉదాహరణలు చెప్పండి. మీ కూతుళ్లు తప్పక అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కోసం అన్వేషించండి. అతను మిమ్మల్నే కాదు, మీ బాధ్యతల్నీ స్వీకరించాలి. అలా అని, తొందరపాటు నిర్ణయాలు వద్దు. చుట్టూ ఉన్న ప్రపంచం ఏమంత మంచిది కాదు. మీ ఆస్తి కోసం, సంపాదన కోసం మీ జీవితంలో చొరబడటానికి కాచుకుని కూర్చున్నవారూ ఉంటారు. జాగ్రత్తగా అడుగువేయండి. గతాన్ని తవ్వుకొని బాధపడొద్దు. జీవితాన్ని కొత్తగా మలుచుకోండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

