కరోనా కాలంలో అరోమా థెరపీ!

అరోమా థెరపీ అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందంటున్నారు నిపుణులు. మహమ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే ముందు మనం బలహీన పడకూడదు. మనసును బలహీన పరచకూడదు. మనోబలాన్ని ఇచ్చే చక్కటి మార్గం అరోమా థెరపీ! అరోమా థెరపీ సుగంధాలు పరిమళింపజేసి మనసుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగించే ఒక ప్రక్రియ. దీనిద్వారా మనసు, శరీరం, ఆత్మలమధ్య సమతుల్యత ఏర్పడుతుంది. సుగంధాలు, అగరొత్తులు, తైలాలు, పుష్పాలతో ఈ చికిత్సనిర్వహిస్తారు.
వాసన అనేది ఇంద్రియాలలో బలమైంది. మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేయడంలో వాసన అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. ఈ వాసనే ఔషధంగా అరోమా థెరపీ పనిచేస్తుంది. ఆ సుగంధ పరిమళాలు మనసును ధ్యానస్థితిలోకి తీసుకెళ్తాయి.
అగరొత్తులు వెలిగించడం ద్వారా నెగెటివ్ శక్తులను పారదోలిన భావన కలుగుతుంది. అరోమా థెరపీ భావోద్వేగాలను ఎదుర్కోవడంలో సహాయ పడటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

