అమ్మే నాకు స్ఫూర్తి!
నటి ఐశ్వర్య అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ‘నా పేరు మీనాక్షి’తో తెలుగువారిని పలకరించిన ఈ కన్నడ కస్తూరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే! ‘సర్వమంగళ మాంగళ్యే’ సీరియల్‌తో ఐశ్వర్య ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నది.
నటి ఐశ్వర్య అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ‘నా పేరు మీనాక్షి’తో తెలుగువారిని పలకరించిన ఈ కన్నడ కస్తూరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే! ‘సర్వమంగళ మాంగళ్యే’ సీరియల్‌తో ఐశ్వర్య ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నది. కన్నడ సినిమాల్లోనూ తళుక్కుమన్న ఈ నటి ‘ముక్కుపుడక’ సీరియల్‌తో అలరిస్తున్నది. వరుస అవకాశాలతో ప్రేక్షకుల మది దోచుకున్న బుల్లితెర బ్యూటీ ఐశ్వర్య ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు..
చిన్నప్పటి నుంచీ అమ్మ కష్టం, ధైర్యం చూస్తూ పెరిగా. ఆమెనే స్ఫూర్తిగా తీసుకున్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మ ఒంటరిగా ఎదుర్కొన్నది. సమాజాన్ని ఎదిరించి నిలబడింది. అమ్మే నాకు స్ఫూర్తి. పెండ్లయిన కొన్నిరోజులకే అమ్మకు అత్తింటి ఆరళ్లు, భర్త ఈసడింపులు మొదలయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మ ఒంటరి జీవితాన్ని ప్రారంభించింది. నా కోసం అమ్మ తన జీవితాన్నే త్యాగం చేసింది. నాన్న అనే ఎమోషన్ నా లైఫ్‌లో లేదు. అమ్మకు నటన అంటే ఇష్టం. తను నటి కావాలనుకుంది. కానీ తనని ఎవరూ ప్రోత్సహించలేదు. దాంతో నన్ను నటిగా తెరపై చూడాలనుకుంది. అందుకే నన్ను థియేటర్లో చేర్పించింది. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్ క్లాస్‌లో జాయినయ్యా. ఇంటర్ పూర్తవగానే ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించా. నటిస్తూనే బీబీఎమ్ పూర్తిచేశా.
అన్ని చానెల్స్‌లో..
ఏషియానెట్ కన్నడలో ప్రసారమైన ‘అనురూప’ నా మొదటి సీరియల్. ఆ తర్వాత కలర్స్ చానెల్ కోసం అర్కా ప్రొడక్షన్లో ‘గిరిజా కల్యాణ’ చేశా. అదే నిర్మాణ సంస్థ ద్వారా తెలుగులో మొదటి అవకాశం వచ్చింది. ‘నా పేరు మీనాక్షి’ నా ఫస్ట్ తెలుగు ధారావాహిక. దాంతో నాకు మంచి పేరొచ్చింది. కన్నడ సీరియల్ ‘అగ్నిసాక్షి’ రీమేక్ ‘సర్వమంగళ మాంగళ్యే’లో కూడా నేనే నటించాను. స్టార్ విజయ్ చానెల్ కోసం ఓ తమిళ ధారావాహికలోనూ నటించాను. జీ తెలుగులో ‘ముక్కుపుడక’ నా మొదటి ప్రాజెక్ట్. ఇలా అన్ని చానెల్స్ నన్ను ఆదరించాయి. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో నటిగా నా ప్రస్థానం హ్యాపీగా కొనసాగుతున్నది.
పెండ్లి తర్వాత..
మా తాతయ్య జర్నలిస్ట్. చిన్నప్పటి నుంచీ సినీపరిశ్రమ, నటన మీద అవగాహన ఉంది. రోజూ ఆయన రాసే ఆర్టికల్స్ చదివేదాన్ని. లాక్డౌన్లో నా పెండ్లి జరిగింది. తర్వాత కూడా సీరియల్స్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. కుటుంబంతో గడపడానికి నెలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నాను. కన్నడలో రెండు సినిమాల్లో నటించా. స్టార్ హీరో యష్ చెల్లెలుగా, శివరాజ్ కుమార్ సినిమాలో ఓ పాత్రలో నటించా. అలాంటి స్టార్ హీరోలతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా పనిపట్ల వారు చూపే శ్రద్ద, పాత్రలో లీనమయ్యే తీరు నన్నెంతో ప్రభావితం చేశాయి. సెట్లో మంచి సలహాలు ఇచ్చేవాళ్లు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలు చూస్తుంటాను. ఒక మంచి మైథలాజికల్ పాత్రలో నటించాలన్న కోరికైతే ఉంది. అది ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
సౌందర్యతో పోలిక..
చాలామంది నన్ను సౌందర్య అని పిలుస్తారు. ఆ మహానటి పోలికలు నాలో ఉన్నాయంటారు. అంత గొప్ప నటితో పోల్చడం చాలా సంతోషంగా ఉంటుంది. నటనలో ఎవ్వరినీ అనుకరించను. నాకంటూ ప్రత్యేకమైన శైలి ఉండాలనుకుంటాను.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

