Women’s Fashion | వస్త్రాలపైనా కుంచె చిత్రాలు..
Women's Fashion | సూదీదారం చిత్రంగా కదులుతాయి. ఒకదానికొకటి పెనవేసుకుని ముడుల మడుల మీదుగా ముచ్చటైన ప్రయాణం సాగిస్తాయి. రంగులూ, మెరుపుల కూడికగా అవి నడిచిన దారి అందమైన ఆకృతిలో మెరుస్తుంది. సృజనకారుడి మనసు అక్కడ ఆవిష్కృతం అవుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ పేరుతో ఇప్పటి వరకు దుస్తుల మీద మాత్రమే మెరిసిన మెరుపులు నగలపైనా తళుకులీనుతున్నాయి.
Women’s Fashion | సూదీదారం చిత్రంగా కదులుతాయి. ఒకదానికొకటి పెనవేసుకుని ముడుల మడుల మీదుగా ముచ్చటైన ప్రయాణం సాగిస్తాయి. రంగులూ, మెరుపుల కూడికగా అవి నడిచిన దారి అందమైన ఆకృతిలో మెరుస్తుంది. సృజనకారుడి మనసు అక్కడ ఆవిష్కృతం అవుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ పేరుతో ఇప్పటి వరకు దుస్తుల మీద మాత్రమే మెరిసిన మెరుపులు నగలపైనా తళుకులీనుతున్నాయి.
రంగవల్లికలు నేల మీద కాకుండా మరెక్కడ కనిపిస్తాయి?… కుంచె చిత్రాలు క్యాన్వాసు మీద కాకుండా మరెక్కడ దర్శనమిస్తాయి?… రంగుల విన్యాసాలు హరివిల్లులో కాకుండా మరెక్కడ విరుస్తాయి? అనే ప్రశ్నకు అందమైన సమాధానమే ఉంది. చేతివేళ్ల మధ్య సన్నగా అమరి, అందమైన పోగుల అల్లికలో అవి కనువిందు చేస్తాయని కుట్టు సొగసు తెలిసిన వాళ్లు చటుక్కున చెబుతారు. పూలూ, తీగల ముస్తాబును వస్త్రానికి అద్దే ఈ కళ ఇంతకుముందు దుస్తులకే పరిమితం. ఆ అందాన్ని ఆభరణానికి కూడా తీసుకొచ్చారు నవతరం డిజైనర్లు. నెక్లెస్‌లు, లాకెట్లు, ఉంగరాలు, బ్రేస్లెట్లు, దుద్దుల్లాంటివి ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ నగలుగా సొగసులీనుతున్నాయి. పూలగుత్తులు, పక్షులు, కొమ్మలతో పాటు అమ్మాయిల బొమ్మలు, అందమైన దృశ్యాలు… వీటిలో ఒద్దికగా ఒదిగిపోతున్నాయి. వేలవన్నెల దారాలున్నట్టే… ఈ నగలనూ విభిన్న వర్ణాల మేళవింపుగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాన్సీ నగల్లాగే మ్యాచింగ్ చూసుకుని కొనుక్కోవచ్చు. ఫ్యాషన్ దుస్తులతో పాటు ట్రెడిషనల్ డ్రెస్‌ల మీదకీ ఇవి నప్పుతాయి. ఇంకేం, కుట్టుదారం నగలు పెట్టుకుని మీరూ కనికట్టు చేసేయండి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

