రాతి మెరుపులు
రాళ్ల నగలంటే రాతియుగపు నాటి నగలు కాదండి. అచ్చంగా రాళ్లతో మలిచిన నగలు. అతివలకు అలంకరించుకోవాలనే ఆశ కలగాలేగాని ఆభరణాలకు కొదవేముంది చెప్పండి. మరి ఎప్పుడూ బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలేనా.. ఓసారి వెరైటీగా రాళ్ల నగలు అలంకరించుకుంటే? అందరిలోకి ప్రత్యేకంగా ఉండి అందరి చూపూ మీమీదే ఉంటుంది కదా. మరి ఆ రాళ్ల నగల ధగధగలేంటో చూసేద్దాం..

పరికించి చూడాలేగాని ప్రకృతి ప్రసాదించిన పూలు, మణులు, మాణిక్యాలు, రాళ్లు.. ఇలా ప్రతివస్తువూ మగువ అందాన్ని మరింత పెంచేదే అయ్యుంటుంది. అన్నీ అందమైన ఆభరణాలుగా మారాల్సిందే. సముద్రతీరాలు, నదీజలాలు, ఎగిసే జలపాతాల్లో ఏండ్ల తరబడి నీటి ఒరవడికి గురై నున్నగా, నాజూకుగా తయారైన రాళ్లు అరణుల ఒంటిపై నగల్లా మారి సుకుమారంగా ఒదిగిపోతున్నాయి. అంతేకాదు ఇండ్ల నిర్మాణం, అలంకరణల్లో వాడే మార్బుల్, గ్రానైట్ సైతం ఖరీదైన నగల్లో అమరిపోతున్నాయి.సాధారణంగా నీటి ప్రవాహాలు, జలపాతాల దగ్గర రాళ్లు నిరంతరం నీళ్లల్లో ఉండి నున్నగా తయారవుతాయి. వాటిని సేకరించి మరికాస్త మెరుగుపెట్టి బంగారం, వెండి, ప్లాటినం గొలుసులకు పెండెంట్లుగా తయారుచేస్తున్నారు నగల తయారీదారులు. ఇవి చూసేందుకు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా బంగారు, వెండి ఆభరణాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. అందుకే ఆధునిక యువతులు ఈ రాళ్ల నగలపై మక్కువ చూపుతున్నారు. ఇవి సంప్రదాయ వస్త్రశ్రేణికే కాదు ఆధునిక దుస్తులపైన కూడా అదిరిపోతున్నాయి.
భిన్నంగా.. చవకగా..
ఒకప్పుడంటే తరణుల ముచ్చట్లు బంగారం చుట్టూరా తిరిగేవి. ఇప్పుడు కాలం మారింది. ఎంత బంగారం, ఎంత ఖరీదు నగలు అనే విషయాలకన్నా భిన్నంగా ఉండేవాటి గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే, నలుగురి దృష్టీ తమపై పడేలా ప్రత్యేక నగలపై మొగ్గుచూపుతున్నారు నేటి మహిళలు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని భిన్నంగా, ప్రత్యేకంగా ఉండే నగలను రూపొందిస్తున్నారు తయారీదారులు. ధరలోనూ చవకగా ఉండటంతో వీటిపై మనసుపడుతున్నారు నేటి ఆధునిక మగువలు.
మార్బుల్, గ్రానైట్తోనూ..
ఇండ్ల నిర్మాణాల్లో, అలంకరణల్లో ఎక్కువగా మార్బుల్, గ్రానైట్ వంటి ఖరీదైన రాళ్లని వాడతారు. వీటికి ఓ ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. అందుకే నిర్మాణాల్లో మిగిలిన మార్బుల్ ముక్కలకి మరింత సానపెట్టి, పలురసాయన చర్యలకు గురిచేసి నగలుగా మార్చేస్తున్నారు. ఇవి చూసేందుకు ఓ వింతైన మెరుపుతో రిచ్లుక్ని ఇస్తాయి. చిన్నచిన్న మార్బుల్, గ్రానైట్ రాళ్లు పొదిగిన గొలుసులు, బిందీలు, బ్రేస్లెట్లు, పెండెంట్లు, ఉంగరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్నివయసుల వారికీ ఈ నగలు బాగుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్ దుస్తులపై ప్రత్యేకంగా కనిపిస్తాయి. లేట్నైట్ పార్టీల్లో లైట్ల వెలుతురులో వీటి మెరుపు మామూలుగా ఉండదు.
భద్రత తేలిక..
బంగారం, వెండి వంటి లోహాల నగలతోపాటు వీటిని కలిపి పెట్టకూడదు. మిగతా నగల్లా వీటిని ప్రత్యేకంగా జాగ్రత్త చేయనవసరం లేదు. ఈ రాళ్ల మెరుపు సహజంగా ఉంటుంది కాబట్టి నల్లబడటం, మెరుగుపెట్టడం వంటి సమస్యలేమి ఉండవు. అయితే, ఈ రాళ్ల నగలని వేసుకున్నప్పుడు బంగారం, వెండి నగలకు తగలకుండా చూసుకోవాలి. గీతలుపడి ఆకర్షణ తగ్గుతుంది. సముద్ర రాళ్లు అయితే అంత జాగ్రత్త అవసరం లేదుగాని, మార్బుల్, గ్రానైట్ రాళ్ల నగలను కాస్త జాగ్రత్తగానే భద్రపరచాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

