మణికట్టుకు సత్తువ

అమ్మదనం అరుదైన వరం. గర్భిణి తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలలు నిండేకొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొంటాయి. అనేక సమస్యలు ఎదురవుతాయి. యోగాతో ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. చిన్న చిన్న ఆసనాలే అయినా శారీరకంగా సత్తువనిస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. గర్భిణుల చేతులకు బలాన్నిచ్చే యోగ భంగిమ.. పశ్చిమ నమస్కారాసనం. అయితే, నిపుణుల సలహాతోనే దీన్ని ప్రయత్నించాలి.
ఎలా చేయాలి?
ముందుగా నిటారుగా తాడాసన స్థితిలో నిల్చోవాలి.
రెండు చేతులనూ వీపు వైపునకు తీసుకోవాలి. అరచేతులు ఒకదానికొకటి ఆనించి, నడుము పైభాగాన చేతివేళ్లు పైకి చూస్తున్నట్టుగా నమస్కార ముద్ర పెట్టాలి.
ఈ సమయంలో రెండు భుజాలూ సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
రెండు అరచేతులతో ఒకదానినొకటి నొక్కి పెట్టాలి. ఈ సమయంలో మోచేతులు రెండూ సమాంతరంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఛాతీని నిటారుగా ఉంచాలి. ఈ క్రమంలో తొడ ఎముక నిటారుగా ఉండి, పొత్తికడుపు లిఫ్ట్ అవుతుంది.
ఈ ఆసన స్థితిలో 15 నుంచి 30 సెకన్లు ఉండాలి. సాధారణ స్థాయిలో శ్వాస తీసుకోవాలి.
పశ్చిమ నమస్కారాసనం వల్ల మోచేతులకు, మణికట్టుకు బలం చేకూరుతుంది.
షరతులు వర్తిస్తాయి
కండ్ల్లు తిరుగుతున్నట్టుగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేయకూడదు.
పొట్టలో అసౌకర్యంగా ఉన్నా.. వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా ఆపేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు,హైదరాబాద్
6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Yoga
- Yoga Training
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

