కావలసిన పదార్థాలు
గుమ్మడి ముక్కలు: ఒక కప్పు, పాలకూర తరుగు: అర కప్పు, చీజ్ తురుము: పావు కప్పు, వేయించిన పల్లీలు, బాదంపప్పు, జీడిపప్పు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఆలివ్ ఆయిల్, తేనె: రెండు టీస్పూన్ల చొప్పున, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె పోసి.. మూతపెట్టకుండానే గుమ్మడి ముక్కలను సన్నని మంటపై దోరగా వేయించాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు చల్లి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పాలకూర తురుము, చీజ్ తురుము, పల్లీలు, బాదంపప్పు, జీడిపప్పు వేసి బాగా కలపాలి. వేయించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు, తేనె, కొద్దిగా ఆలివ్ ఆయిల్ జోడించి మళ్లీ కలుపుకొంటే ఆరోగ్యానికి మేలు చేసే గుమ్మడి సలాడ్ సిద్ధం.