టీఎస్ బీ-పాస్.. పకడ్బందీగా అమలు
గ్రేటర్ వరంగల్ పరిధిలో టీఎస్ బీ పాస్ పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్‌ను బల్దియా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
- పారదర్శకత పాటిస్తున్న బల్దియా
- అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే అనుమతులు
- లేకుంటే నో పర్మిషన్..
- ఇటీవల పలు భవనాలకు తిరస్కరణ
- ఒత్తిడులకు తలొగ్గని గ్రేటర్ అధికారులు
వరంగల్, 16: గ్రేటర్ వరంగల్ పరిధిలో టీఎస్ బీ పాస్ పక్కాగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్‌ను బల్దియా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పారదర్శకత పాటిస్తున్నారు. అవసరమైన అన్నిరకాల డాక్యుమెంట్లు ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం లేకుంటే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తిరస్కరిస్తున్నారు. ఇటీవల పలు నిర్మాణాలకు ఫైర్, రెవెన్యూ ఎన్వోసీలు సమర్పించకపోవడంతో నిరాకరించారు. దీంతో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతున్నది.
టీఎస్ బీపాస్‌ను బల్దియా పక్కాగా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్ బీ పాస్ విధానంలో అక్రమ నిర్మాణాలకు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పడుతోంది. ఈ విధానంలో డ్యాకుమెంట్లు సరిగా ఉంటేనే అనుమతులు చేస్తున్నారు. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో బల్దియా టౌన్ ప్లానింగ్ పారదర్శకత పాటిస్తున్నారు. నిబంధనల ప్రకారం డ్యాక్యుమెంట్లు సమర్పించని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా అనుమతులు జారీ చేస్తున్నారు.
భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో అవినీతితోపాటు జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు గతంలో మాన్యువల్ నుంచి డీపీఎంఎస్ విధానం తీసుకువచ్చారు. మరింత పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీపాస్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో పారదర్శకత ఏర్పడి అనుమతుల మంజూరులో జాప్యం తగ్గింది.
ఒత్తిడులకు తలొగ్గని అధికారులు
టీఎస్ బీపాస్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న గ్రేటర్ అధికారులు అనుమతుల మంజూరులో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గడం లేదని పలుమార్లు స్పష్టమైంది. ఇటీవల నగరంలోని హంటర్‌రోడ్డులో ప్రముఖ వ్యాపారవేత్త చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణానికి సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అనుమతులను నిరాకరించారు. ఫైర్ ఎన్వోసీ, రెవెన్యూ ఎన్వోసీ సమర్పించకపోవడంతో అనుమతులు ఇవ్వలేదు. హనుమకొండ, ఓ సిటీ సమీప ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాల దరఖాస్తుల్లోనూ సరైన డాక్యుమెంట్ల సమర్పించకపోవడంతో అనుమతులకు నో చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని వేరే సర్వే నంబర్లతో చేసిన దరఖాస్తులకు టీఎస్ బీపాస్ విధానంతో చెక్ పడుతున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

