నా ఫోటోలు పెట్టి డబ్బులు అడుగుతున్నారు : కలెక్టర్ గోపి
అలాంటి మెసేజ్‌లు వస్తే పొరపాటున కూడా నమ్మకూడదని, ఎవ్వరూ మోసపోకూడదని ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దని కలెక్టర్ కోరారు. ఈవిషయంపైన సంబంధిత
వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని ప్రజలను కోరారు. తన ఫోటోను కాపీ చేసి వాట్సప్ ప్రొఫైల్‌గా పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడుగుతున్నారని ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. జిల్లా అధికారులు, ప్రజలు జాగ్రత్తగా ఉండి తన ఫోటోతో వచ్చే ఫేక్ మెసేజ్‌లకు రెస్పాండ్ కావొద్దని కోరారు.
6201570373 నెంబర్‌కు తన ఫోటోని పెట్టుకొని, ఆ నెంబర్‌తో వాట్సప్ ఉపయోగిస్తూ అమెజాన్ ఈపే గిఫ్ట్ కొనాలంటూ ఇప్పటి వరకు కొందరు జిల్లా అధికారులకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ మెసేజ్‌లు పెట్టినట్టు కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.
అలాంటి మెసేజ్‌లు వస్తే పొరపాటున కూడా నమ్మకూడదని, ఎవ్వరూ మోసపోకూడదని ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దని కలెక్టర్ కోరారు. ఈవిషయంపైన సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. తొందరలోనే ఫేక్ మెసేజ్‌లు పెట్టే సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటారని ఆయన తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

