బీజేపీ మోసపూరిత రాజకీయాలను తిప్పికొట్టండి
మంత్రి ఎర్రబెల్లి | బీజేపీ చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త పై ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

వరంగల్ అర్బన్ : బీజేపీ చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త పై ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన ఉద్యమకారులకు, పార్టీ ముఖ్య నాయకులకు కేసీఆర్ తగిన స్థానం కల్పిస్తారని తనవంతుగా హామీ ఇస్తున్నట్లు చెప్పారు. కనీసం కరోనా పేషెంట్ల పట్ల జాలి చూపని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ విక్రయాలను పక్క రాష్ట్రాల్లో 150 రూపాయలకు ఇస్తూ తెలంగాణలో 400 రూపాయలు అధిక ధరలను విక్రయిస్తుందని విమర్శించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ టికెట్లు ఇచ్చాం. కరోనా విజృంభిస్తున్న వేళ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ పార్టీ గెలుపుకై ప్రతి కార్యకర్త పాటుపడాలని సూచించారు.
అనంతరం పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. వారిక గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు బింగి శ్రీనివాస్, శివ, రాజు తదితరులు ఉన్నారు.
సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకర రవి శంకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, రైతు రుణవిమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రాష్ట్ర నాయకులు జన్ను జకార్యా పార్టీ నేతలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

