బావను చంపిన బామ్మర్దులు
బావను బామ్మర్దులు దారుణంగా హత్య చేసిన సంఘటన హనుమకొండ రెడ్డికాలనీలో కలకలం రేపుతోంది. హనుమకొండ సీఐ వేణుమాధవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
- బండరాళ్లతో కొట్టి దారుణ హత్య
- హనుమకొండ రెడ్డి కాలనీలో కలకలం
హనుమకొండ చౌరస్తా, మే 21: బావను బామ్మర్దులు దారుణంగా హత్య చేసిన సంఘటన హనుమకొండ రెడ్డికాలనీలో కలకలం రేపుతోంది. హనుమకొండ సీఐ వేణుమాధవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ న్యూరాయపురకు చెందిన మీర్జా అహ్మద్‌బేగ్ (33) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తపై కక్ష పెంచుకున్న ఆమె విషయాన్ని తమ్ముళ్లకు చెప్పింది. పథకం ప్రకారం శనివారం రాత్రి బావ, బామ్మర్దులు రెడ్డికాలనీలో ఆటోలో మద్యం తాగి గొడవ పడ్డారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న పెద్దపెద్ద బండరాళ్లతో అహ్మద్బేగ్ను దారుణంగా కొట్టి చంపినట్లు పేర్కొన్నారు. వెంటనే విషయం తెలుసుకున్న హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సైలు రాజ్‌కుమార్, రాజు, ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి ఇంటికి తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

