కేటీఆర్ పేరు వింటేనే ప్రతిపక్షాల్లో వణుకు
తెలంగాణ రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ డిమాండ్ చేశారు.
- ఆదరణ చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి విమర్శలు
- టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
- కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు
- టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్
హనుమకొండ, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ర్టానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాసంలో దాస్యం విలేకరులతో మాట్లాడారు. మే 6న ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ సందర్భంగా గురువారం హనుమకొండలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో వణుకు పుడుతున్నదన్నారు. రేవంతర్‌రెడ్డి వరంగల్‌కు వచ్చి రైతు సంఘర్షణ సభ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న క్రమంలో కాంగ్రెస్‌లో వర్గపోరు ప్రారంభమైందన్నారు.
రాహుల్‌గాంధీకి దేశ సరిహద్దులు, ప్రజాసమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ప్రతినిధుల సభ విజయవంతమైందనే అక్కసు, అసూయతో అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే సమస్యే లేదు.. ఖబడ్దార్ రేవంత్‌రెడ్డి అని హెచ్చరించారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. బ్యాండ్ బాజా రేవంత్‌రెడ్డి బ్యాచ్ ఖబడ్దార్ అని అరూరి హెచ్చరించారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కార్పొరేటర్ సునీల్, శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

