విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
బచ్చన్నపేట, సెప్టెంబర్ 23 : కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ (ఏఎక్స్ఎల్)ను ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు కంప్యూటర్లను సరైన విధంగా వినియోగించేలా కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం 5వ తరగతి, ప్రీ-ప్రైమరీ, యూకేజీ, 2వ తరగతి, 3వ తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పర్యవేక్షించిన కలెక్టర్ , పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదే విధంగా ఉన్నత పాఠశాల తరగతి గదుల సంఖ్య, విద్యార్థులు ఎంత మంది అనే వివరాలపై ఆరా తీశారు. పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారని ఎంఈవో వెంకట్ రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.
మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన కలెక్టర్, కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న విధానాన్ని గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పరిశీలనలో సర్పంచ్ ఫిరోజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమృత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

