వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వదినపై మరిది గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వదినపై మరిది గొడ్డలితో దాడి చేశాడు.
ఈ దాడిలో కవిత మెడపై తీవ్ర గాయాలు కాగా, ఆమెను ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.