మెగా ప్రాపర్టీ షోకు రారండోయ్
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనున్నది.
- ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేడు, రేపు ఎక్స్పో
- హరిత కాకతీయ హోటల్ వేదికగా రెండు రోజుల పాటు కార్యక్రమం
- పాల్గొననున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు
- ప్రారంభించనున్న నగర మేయర్ గుండు సుధారాణి
- సందర్శకులకు ఉచిత ప్రవేశం.. లకీ డ్రా ద్వారా గిఫ్టులు
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనున్నది. ఇందులో వివిధ బ్యాంకులు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉత్సాహంగా పాల్గొంటుండగా నగర మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 10.30 గంటలకు ప్రాపర్టీ షోను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ స్మార్ట్‌సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ స్థిరాస్తుల క్రయవిక్రయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేరాఫ్ మారిన తరుణంలో మెగా ప్రాపర్టీ షోకు ప్రాధాన్యం సంతరించుకుంది.
– వరంగల్, ఫిబ్రవరి 1
వరంగల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. స్థిరాస్తుల క్రియవిక్రయాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేసింది. ఇది వరంగల్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునేందుకు ఊతం ఇచ్చింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేస్తున్న తరుణంలో వరంగల్ విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా ఇక్కడ రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఊపందుకుంది. కుడాతో పాటు అనేక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన ఎన్నో వెంచర్లు విజయవంతం అయ్యాయి. ఇంకా పెద్ద ఎత్తున వెంచర్లు సైతం ఏర్పాటుచేస్తుండగా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
సామాన్యులు సొంతింటి కల నిజం చేసేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంకల్పించి ఒకే వేదికపైకి అనేక రియల్ సంస్థలను తీసుకొచ్చి అనువైన ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. ఈ ప్రాపర్టీ షోకు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు లక్కీడ్రా ద్వారా బహుమతులు అందజేయనున్నారు. మెగా ప్రాపర్టీ షోలో హైదరాబాద్, వరంగల్, హనుమకొండ నగరాల నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు బ్యాంకులు భాగస్వామ్యం అవుతున్నాయి.
షో స్పాన్సర్లు
మెగా ప్రాపర్టీ షోను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. మీడియా పార్ట్నర్గా ‘టీ న్యూస్’ వ్యవహరిస్తుండగా మెయిన్ స్పాన్సర్‌గా ఏవీ ఇన్ఫ్రాకాన్, కో స్పాన్సర్‌గా డీసీసీ బ్యాంక్, అసోసియేషన్ విత్గా బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్, టీమ్లైన్ ఎకోసిటీ, నేచర్ స్ప్రింగ్, సరిత కన్స్ట్రక్షన్స్, అనురాగ్ బిల్టర్స్ అండ్ డెవలపర్స్, స్టేట్ బ్యాంక్ ఇండియా, ఎస్ఎన్ కన్స్ట్రక్షన్స్, హరిహర అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గిఫ్ట్ స్పాన్సర్‌గా నీలోఫర్ లాం టి ప్రముఖ సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

