నిట్‌లో 5 నుంచి స్ప్రింగ్ స్ప్రీ
వరంగల్ నిట్ ఈనెల 5 నుంచి 7 వరకు వార్షిక సాంసృతిక ఉత్సవం స్ప్రింగ్ స్ప్రీకి ము స్తాబైంది. 1978 నుంచి ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సాంసృతిక ఉత్సవాల్లో ఒకటి.
- మూడు రోజుల పాటు వేడుకలు.. పాల్గొననున్న ప్రముఖ సింగర్స్
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: వరంగల్ నిట్ ఈనెల 5 నుంచి 7 వరకు వార్షిక సాంసృతిక ఉత్సవం స్ప్రింగ్ స్ప్రీకి ము స్తాబైంది. 1978 నుంచి ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సాంసృతిక ఉత్సవాల్లో ఒకటి. స్ప్రింగ్ స్ప్రీ కళ, సాహిత్యం, నాటకం, నృత్యం, సంగీతం, క్విజ్, ఫొటోగ్రఫీ, పెయింటింగ్, ఫ్యాషన్ షో, రాక్ మ్యూజిక్ కాంపిటీషన్ విభాగాల్లో అనేక ఈవెంట్లను ప్రదర్శిస్తారు. స్పాట్లైట్ ఈవెంట్లు(నాటకం, నృత్యం, కళలు), కొరియోనైట్ (డ్యాన్స్), అల్లూర్ (ఫ్యాషన్ షో), డైరెక్టర్స్ కట్ (కళాకారులు దర్శకులను ప్రోత్సహించే కార్యక్రమం), నుకడ్ నాటక్(సామాజిక సమస్యలపై దృష్టిసారించే వీధి నాటకం) వివిధ క్లబ్‌ల నుంచి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సంవత్సరం, రెండు ప్రోషోలు ఉంటాయి. ఏప్రిల్ 5న గాయకుడు హరిచరణ్, ప్రముఖ సౌత్ ఇండియన్ రాక్ బ్యాండ్ రస్తా ప్రదర్శన ఇవ్వనున్నట్లు, 6న గాయకుడు నకాశ్ అజీజ్, ఇండియన్ రాక్ బ్యాండ్ లోహర్-ది బ్లాక్ స్మిత్ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నిట్ విద్యార్థులు, ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసాచార్య తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

