క్రీడాకారులకు క్రమశిక్షణ, నైపుణ్యం తప్పనిసరి
క్రీడాకారులకు క్రమశిక్షణ, నైపుణ్యం, సమయస్ఫూర్తి తప్పనిసరని క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
- క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
- హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం
సుబేదారి, నవంబర్ 16 : క్రీడాకారులకు క్రమశిక్షణ, నైపుణ్యం, సమయస్ఫూర్తి తప్పనిసరని క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రం జేఎన్ఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ క్రీడాకారులకు నిలయమని, ఇక్కడి నుంచి ఎంతో మంది రాష్ట్ర, దేశ, ప్రపంచస్థాయి క్రీడాపోటీల్లో రాణించారని అన్నారు. ఇటీవల దీప్తి జీవంజి పారా ఒలింపిక్స్‌లో రాణించిందన్నారు.
తాను కూడా రంజీ క్రికెట్ ఆడానని, 149 స్పీడ్‌తో బౌలింగ్ చేసినట్లు చెప్పారు. ఎన్నో కష్టాలు పడి రాణించానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ సాయికుమార్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
దీప్తికి 500 గజాల స్థలాన్ని కుడా రిజెక్ట్ చేసింది : ఎమ్మెల్యే నాగరాజు
ప్రపంచ పారా ఒలిపింక్స్‌లో రాణించిన తన నియోజకవర్గానికి చెందిన దీప్తి జీవంజికి వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని తాను కుడా (కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ)ను కోరితే రిజెక్ట్ చేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి స్పందిస్తూ ఆ ముచ్చట ఇప్పుడెందుకని అడ్డుపడడంతో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

