హనుమకొండ, జూన్ 27 : విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు డేటా ఆధారిత నిర్ణయాలతో విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ డీఎం కర్నాటి వరుణ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక కార్యాచరణ మేధస్సు, పనితీరు పర్యవేక్షణ ఆధారిత సమగ్ర డిజిటల్ డ్యాష్ బోర్డ్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీ సంస్థలోని అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు, సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా విభాగాల వారీగా డిజిటల్ డ్యాష్ బోర్డ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక కమాండ్ ఇంటర్ ఫేస్ ద్వారా సంస్థ పరిధిలోని అన్ని సరిళ్లు, డివిజన్లు, సెక్షన్ల రోజువారీ కార్యకలాపాలు, రియల్ టైమ్‌లో సీనియర్ మేనేజ్మెంట్కు, అలాగే అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ డ్యాష్ బోర్డ్ ద్వారా సంస్థలోని ఆపరేషన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రాజెక్ట్‌లు, ఎంఆర్ టీ, పర్చేజ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ కన్స్యూమర్ కేర్ సెంటర్ తదితర విభాగాల పనితీరును ఒకే వేదికపై రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే మెటీరియల్ నిల్వలు, ఉద్యోగుల వివరాలు, 1912 ఫిర్యాదుల పరిషారం, సబ్ స్టేషన్ నిర్మాణాలు, ట్రాన్స్ఫార్మర్ పనితీరు, విద్యుత్ దొంగతనాల నియంత్రణ, ఆదాయ వసూళ్లు, బిల్లింగ్ తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. డేటా అనలిటిక్స్ ఆధారంగా సమస్యలను ముందుగానే గుర్తించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, క్షేత్రస్థాయి పనితీరును మెరుగుపరచడం, వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడానికి ఈ వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతుందని సీఎండీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ పంపిణీ సంస్థగా టీజీ ఎన్పీడీసీఎల్‌ను తీర్చిదిద్దడంలో ఈ డిజిటల్ డ్యాష్ బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని వరుణ్‌రెడ్డి పేరొన్నారు.