ముక్కు మూసుకోవాల్సిందే!
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే గర్భిణులు, బాలింతలు ముక్కులు మూసుకొని, ఊపిరి బిగపట్టి వైద్యం పొందాల్సి వస్తున్నది. కొత్తగా జన్మించిన నవజాత శిశువులు, శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న మహిళలు సంచరించే ప్రాంతంలో కనీస పారిశుధ్య చర్యలు కనిపించడంలేదు.
- కంపు కొడుతున్న సీకేఎం దవాఖాన ఆవరణ
- రోజుల తరబడి చెత్త తొలగించని సిబ్బంది
- ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు
వరంగల్‌చౌరస్తా, నవంబర్ 3 : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే గర్భిణులు, బాలింతలు ముక్కులు మూసుకొని, ఊపిరి బిగపట్టి వైద్యం పొందాల్సి వస్తున్నది. కొత్తగా జన్మించిన నవజాత శిశువులు, శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న మహిళలు సంచరించే ప్రాంతంలో కనీస పారిశుధ్య చర్యలు కనిపించడంలేదు.
గతంలో సైతం కలెక్టర్లు సదరు పారిశుధ్య కాంట్రాక్టర్‌ను మందలించినా తీరు మారడం లేదు. హాస్పిటల్ ఆవరణ పూర్తిగా చిన్నస్థాయి డంపింగ్ యార్డును తలపిస్తున్నది. హాస్పిటల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచడానికి గతంలో 15 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తించే వారు. గత ప్రభుత్వం కేసీఆర్ కిట్‌తో పాటుగా మెరుగైన వైద్యం అందించడంతో సేవలను వినియోగించుకునే మహిళల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.
దీంతో పారిశుద్య చర్యలను మెరుగు పర్చడం, పేషెంట్ కేర్ వ్యవస్ధను పటిష్టం చేయడం కోసం అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. నూతనంగా నియమించిన సిబ్బందిని కార్యాలయ విధులకు వినియెగిస్తుండడంతో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 23 మంది పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికీ విధుల్లో మాత్రం 13 మంది మాత్రమే ఉంటుండడంతో నిర్వహణ గాడి తప్పింది. పారిశుధ్యం సరిగా లేకపోవడంతో శస్త్రచికిత్సలు నిర్వహించుకున్న మహిళల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పటిష్ట పారిశుధ్య చర్యలు చేపట్టాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

