దుగ్గొండి, డిసెంబర్ 8: గిర్నిబావిలో ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీలు, కాలుష్య నిర్ధారణ, ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించారు. వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని, పెండింగ్ చలాన్లను చెల్లించాలని ఎస్సై కోరారు.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో ఒకరికి జైలు
వరంగల్ చౌరస్తా(మట్టెవాడ), డిసెంబర్ 8: మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలుశిక్ష పడినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జీ బాబులాల్ తెలిపారు. 11 మందిని గురువారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రం వీరస్వామి ఎదుట హాజరు పర్చినట్లు సీఐ చెప్పారు. ఇందులో వంగరి గౌరీశంకర్‌కు రెండు రోజుల జైలుశిక్ష విధించగా, పరకాల సబ్‌జైలుకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. మరో 10 మందికి రూ. 13 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.