సుబేదారి, జూలై 1 : వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేతకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటి ప్రవర్తిస్తుండడంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. దీంతో ప్రజలకు రక్షణ లే కుండా పోతున్నది. ప్రధానంగా రాజకీయ నేతల సపోర్ట్‌తో పోస్టింగ్‌లు పొంది, నేతల కనుస న్నల్లో పనిచేస్తూ విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతున్నారు. ఇదేకాకుండా నగరం, చుట్టపక్కల ప్రాంతాల్లో భూకబ్జాలకు గురికావడం, బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తి పడీ కబ్జాదారులకు సపోర్ట్ చేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఎస్సై లు, ఇన్స్పెక్టర్లు, మరికొందరు ఏసీపీలు రాజకీయ నేతల అండదండలతో ఇక్కడే పోస్టింగ్‌లు పొంది పాతకుపోయారు. దీంతో అనినీతితోపాటు నేరాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నా యి. హత్యలు, హత్యాయత్పాలు, పొలిటికల్ రౌడీషీటర్ల సెటిల్మెంట్లు, దందాలు, చైన్ స్నా చింగ్‌లు, దోపీడీలు, దాడులు ప్రజలను కలవరపెడుతున్నాయి. గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, చిట్‌ఫండ్స్ సంస్థల మోసాలు, గంజాయి ముఠాలతో యువత మత్తుకు బాని సవుతున్నారు. ఇవన్నీ కొత్త వరంగల్ పోలీసు కమిషనర్‌కు సవాళ్లుగా మారనున్నాయి.
ప్రజాప్రతినిధులకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీల పోస్టింగ్‌ల విషయంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిపోవడం, వారికి నచ్చినవారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ప్రధానంగా ఇన్స్పెక్టర్లు హద్దులు దాటి ప్రవరిస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వీరికి కొంతమంది నేతల సపోర్ట్ ఉన్నందున పోలీసు ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారే విమర్శలు ఉన్నా యి. పోస్టింగ్‌లో ఉన్నపుడే డబ్బులు సంపాదించుకోవాలనే కక్కుర్తితో కొందరు పోలీసు అధికారులు ల్యాండ్ పంచాయితీల సెటిల్మెంట్లు చేస్తున్నారు. గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులతో చేయి కలుపుతున్నారు.
కొందరు ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు, వివిధ రకాల కేసుల నమోదు, సిబ్బందితో స్టేషన్ బెయిల్ పేరుతో వసూళ్లకు పాల్పడడం టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటువంటి వారి విషయంలో ఏడాదిన్నర కాలం పనిచేసి బదిలీ అయిన పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ కొరడా ఝులిపించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీపీ శ్వేత వారిని ఎలా కంట్రోల్ చేస్తారు?, పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నేతల ఒత్తిళ్లు, భూకబ్జాలు చేసే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రౌడీలీడర్ల పట్ల ఎలా వ్యవహరిస్తారు?
గంజాయి రవాణా, స్మోకింగ్, వరంగల్ నగర ట్రాఫిక్, సమస్యలపై ఏం చర్యలు తీసుకుంటారోనని నగర వాసులు ఎదురుచూస్తున్నారు. కమిషనరేట్‌లో వేధింపులకు గురవుతున్న మహిళా అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారిగా ఆమె ఏవిధమైన సపోర్ట్‌గా ఉంటుంది, అదేవిధంగా విద్యార్థినులు, మహిళలపై కృత్యాలు అరికట్టడానికి మహిళ పోలీసు ఉన్నతాధికారిగా శ్వేతపై అనేక ఆశలు ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ఆమె పనితీరు ఎలా ఉంటుందోనని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలు అసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాధ్యతలు స్వీకరించిన శ్వేత
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్ శ్వేత బాధ్యతలు చేపట్టారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో బదిలీ అయిన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నుంచి బాధ్యతలు స్వీక రించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేతను డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు అ ధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అం దించడానికి సమన్వయంతో సమర్థవంతంగా పనిచేద్దామన్నారు. అనంతరం సీపీ భద్రకాళీ అమ్మవారిని దర్శిం చుకున్నారు. ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆశీర్వచ నం అందించి అమ్మవారి శేషవస్ర్తాలు అందజేశారు.