ప్రచారానికి తెర
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
- ఇక పోల్ మేనేజ్మెంట్పైనే అందరి దృష్టి
- చివరి రోజు సమావేశాల జోరు
- బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి విశేష ఆదరణ
- గెలుపుపై పూర్తి విశ్వాసంతో శ్రేణులు
నల్లగొండ ప్రతినిధి, మే 25(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. దీంతో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలకు బ్రేక్ పడినట్లయింది.
అయితే చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారంలో మునిగితేలారు. స్థానిక నాయకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ప్రచారం మొదలైనప్పటి నుంచి భాగస్వాములు కాగా రోజురోజుకూ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. తమ ప్రచారంలో అన్ని వర్గాల నుంచి లభించిన ఆదరణతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలుకానున్నది. నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచి ఆ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామగ్రితో బయల్దేరుతారు. ఆదివారం సాయంత్రానికి తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేక రూట్లుగా విభజించి వాహనాలను ఏర్పాటు చేశారు. రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది సోమవారం ఉదయం 6గంటల వరకే సిద్ధంగా ఉండనున్నారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను తొలుత అన్ని జిల్లాకేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడినుంచి భారీ బందోబస్తు మధ్య నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించి భద్రపరుస్తారు. వచ్చే నెల 5న ఓట్ల లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగానికి సూచనలు చేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 52కి అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను, ఇతర సామగ్రిని ఇప్పటికే ఆయా జిల్లాకేంద్రాలకు చేరవేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

