9న నగరానికి మంత్రి కేటీఆర్
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
- కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
- వరద ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు
- పేదల కోసం త్వరలో అపార్ట్మెంట్ల నిర్మాణం
- లేబర్ అడ్డాల వద్ద షెల్టర్లు..
- తొమ్మిదేళ్లలో రూ.4500 కోట్లతో వరంగల్ అభివృద్ధి
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి రానున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బుధవారం ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కుడా కార్యాలయంలో అరవింద్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ నెల 9న ప్రారంభిస్తారన్నారు. వరద ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పేదల కోసం త్వరలోనే అపార్ట్మెంట్లను నిర్మించి ఫ్లాట్లను అందజేస్తామని పేర్కొన్నారు. లేబర్ అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. తొమ్మిదేళ్లలో రూ.4500 కోట్లతో వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు.
వరంగల్, సెప్టెంబర్ 6 :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ మాట్లాడుతూ నగరంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ నెల 9న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కవులు, కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. నగరంలో మధ్య తరగతి వర్గాల కోసం కుడా ఆధ్వర్యంలో అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. కాస్ట్ టూ కాస్ట్ పద్ధతిలో మధ్య తరగతి వర్గాలు ప్లాట్లు కొనుగోలు చేసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ కార్మికుల కోసం కార్మిక భవన్ నిర్మిస్తున్నామని, ఆరు మోడల్ లేబర్ అడ్డాలకు షెల్టర్లు నిర్మించనున్నట్లు వివరించారు. సమ్మయ్యనగర్ నాలా పక్కన వరద బాధితులకు 9 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించి, అందచేస్తామని తెలిపారు. పెద్దమ్మగడ్డ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి అందులో ప్లాట్లు కేటాయిస్తామని వివరించారు.
ఎస్ఎన్డీపీకి ప్రణాళికలు : అరవింద్‌కుమార్
స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్లాన్(ఎన్ఎస్డీపీ)కి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ అన్నారు. నగరానికి వదర ముంపు నివారణకు శాశ్వత పరిషారం చూపేందుకు హైదరాబాద్ తరహాలో దీన్ని వరంగల్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్ నాలాలను వ్యూహత్మకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విలీన గ్రామాల్లోని చెరువులను పరిగణనలోకి తీసుకోని వర్షపాతం నమోదు డాటా ప్రకారం ప్రత్యేక ఏజెన్సీ ద్వారా దీర్ఘకాలిక మాస్టర్ బేసిక్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. 30 కిలోమీటర్ల మేరకు ఎన్ఎస్డీపీ పనులను త్వరలో చేపడుతామన్నారు. వరదల నేపథ్యంలో ధ్వంసమైన పైప్లైన్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లలో ఇక్కడ రూ.4500 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. నగరంలో శాశ్వత మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రూ.3 కోట్లతో చేపట్టిన 19 జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. వరదల వల్ల జరిగిన నష్టానికి వెంటనే మంత్రి కేటీఆర్ రూ.250 కోట్లు మంజూరు చేశారన్నారు.
వేగంగా నగరం అభివృద్ధి : గుండు సుధారాణి, మేయర్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరద నష్టం తక్షణ సహాయంగా నగరానికి రూ.250 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో నగరంలో వరద ముంపు నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ఎస్డీపీ కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించి ఏజెన్సీని నియమించి నగరానికి పంపించారన్నారు.
వరద కాలువకు రూ.158 కోట్లు : ఎమ్మెల్యే నన్నపునేని
భద్రకాళీ, సంతోష్మాతా కాలనీ ప్రాంతాల్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ రూ.158 కోట్లు మంజూరు చేశారని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి జరుగుతోందన్నారు. పనుల వేగంవంతం కోసం నగరానికి విచ్చేసిన అరవింద్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి : ఎమ్మెల్యే అరూరి రమేశ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇటీవల వరద వల్ల నగరం ముంపునకు గురికావడంతో వాటి నివారణకు హైదరాబాద్ తరహాలో ఎన్ఎస్డీపీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల వరదలతో జవహర్‌కాలనీ, పరిమళ కాలనీలో తీవ్ర నష్టం జరిగిందన్నారు. అక్కడి నాలాలను విస్తరించాలని సూచించారు. అభివృద్ది పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనుల పరిశీలిన
నగరానికి విచ్చేసిన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నగరంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలించారు. 9న మంత్రి కేటీఆర్ దాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అలాగే, సెంటల్ ల్రైబరీ జంక్షన్, సమ్మయ్యనగర్ నాలా, నయీంనగర్ నాలాలను ఆయన పరిశీలించారు. చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు అశ్విని, మహేందర్‌జీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు నల్లా స్వరూపారాణి, చెన్నం మధు, వేముల శ్రీనివాస్, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్అండ్బీ, కుడా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

