అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తాం
రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
- రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించలేదు
- ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హనుమకొండ చౌరస్తా, జూన్ 7: రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాకతీయ తోరణంపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, తొలగిస్తామనే విషయం ఇంకా బయటికి రాలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను రిఫరెండంగా తీసుకున్నామని, ఆరు గ్యారెంటీలను పథకాలను అమలు చేస్తామన్నారు.
కడియం శ్రీహరితో కడియం కావ్యకు ఎఫె క్ట్ అయిందన్నారు. దేశంలో బీజేపీ డబ్బులు పంచి గెలిచిందని ఆరోపించారు. ఎంపీ కడియం మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్, ఇండస్ట్రియల్ కారిడార్, కోచ్ ఫ్యాక్టరీ, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానన్నారు. వరంగల్ ప్రజలు లౌకికవాదాన్ని కోరుకున్నారని, మతతత్వ బీజేపీని ఓడించారన్నా రు. తనను నమ్మి టికెట్ ఇచ్చిన సోనియాగాంధీ, మల్లికార్జున కర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
దేశానికి ప్రజాస్వామ్య మే శ్రీరామరక్ష, రాజకీయ పార్టీల విశ్లేషణ ఎగ్జిట్ పోల్స్‌కు అందని రిజల్ట్స్ ఇచ్చిన వరంగల్ ప్రజలు చాలా గొప్పవారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ ప్రజలు ఊహించని మెజార్టీతో గెలిపించారని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయిని లక్ష్మారెడ్డి, దండ్రె చిన్నా, సీనియర్ నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, వంశీ పాల్గొన్నారు.
ఇంకా ఎడమొహం పెడమొహమే..
మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇద్దరు ఇంకా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్నా పార్టీలో అందరినీ కలుపుకునిపోవాలని మాట్లాడుకోకుండా ముందుకెళ్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణతో ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతుండడం తెలిసిందే. సమావేశానికి మంత్రి ఆలస్యంగా రావడంపై ప్రకాశ్‌రెడ్డి క్షమాపణ చెప్పడంపై నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

