మేడారానికి జాతీయ హోదా కుదరదు
దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వలేమని పేర్కొన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ఆయన హనుమకొండలోని హరిత హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల హమీ బీజేపీది కాదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు.
- దేశంలో ఏ ఉత్సవానికి ఇవ్వలేదు
- బీసీలను మోసం చేసింది కాంగ్రెస్సే..
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్, నవంబర్ 29 : దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వలేమని పేర్కొన్నారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ఆయన హనుమకొండలోని హరిత హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల హమీ బీజేపీది కాదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలను కలిపి బీసీలను మోసం చేసిందన్నారు.
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు గతంలో మాదిరిగానే ట్రైబల్, పర్యాటక శాఖలతో చర్చించి అధిక నిధు లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగడతామని, పోరాటాలు చేస్తామని తెలిపారు. పత్తి కొనుగోళ్ల విషయమై సీసీఐ అధికారులతో చర్చించామని, రైతులు అధైర్య పడొద్దని, చివరి క్వింటా వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. కాజీపేట సమీపంలో ఏర్పాటు చేస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా సాగుతున్నాయని, మరో ఏడాదిలో పూర్తి చేసి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం డిమాండ్ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ డిజైన్ పూర్తయ్యిందని, మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పూర్తిచేస్తే ప్రధాని మోదీ చేత శంకుస్థాపన చేయిస్తామన్నారు. తొలుత ఏటీఆర్ విమానాలు నడిపిస్తామని పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన వరంగల్ రైల్వే స్టేషన్, వేయిస్తంభాల దేవాలయం అభివృద్ధి పనులతో పాటు రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, రావు పద్మ, కొలను సంతోష్‌రెడ్డి, గంటా రవికుమార్, డాక్టర్ కాళీ ప్రసాద్, వన్నాల శ్రీరాములు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు?
- వేయిస్థంభాల గుడి ఆరియాలజీ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
హనుమకొండ చౌరస్తా : చారిత్రక వేయి స్తంభాల దేవాలయ కల్యాణ మండపం పనులు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని, గడిచిన రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారని ఆర్కియాలజీ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కేంద్ర పురావస్తుశాఖ రాష్ట్ర సూపరింటెండెంట్ నిహిల్దాస్, ఆర్కియాలజీ విభాగం డిప్యూటీ ఇంజినీర్ కృష్ణచైతన్య, జిల్లా అధికారి అజిత్, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వైదిక సిబ్బంది మంత్రికి స్వాగతం పలుకగా, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన కల్యాణ మండపాన్ని సందర్శించి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 5 శాతం పనులను చూసి అధికారులపై మండిపడ్డారు. దేవాలయ పనుల పూర్తిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

