దీపావళి పర్వదిన సందర్భంగా మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పండుగ వేళ ఇల్లు, దుకాణాల అలంకరణకు వినియోగించే పూలతో పాటు ప్రమిదలు, పటాకులు, నోము కోసం అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడిగా మారాయి. ఉమ్మడి జిల్లాకేంద్రం సహా అన్ని ప్రాంతాల్లో శనివారం ప్రధాన కేంద్రాలు, రోడ్ల వెంట విక్రయాలు జోరుగా సాగాయి.
ఇటు దుస్తుల కొనుగోళ్లతో బట్టల షాపులు, ఇతర షోరూంలు రద్దీగా కనిపించాయి. అలాగే పటాకుల కోసం పదుల సంఖ్యలో వెలసిన స్టాళల్లో వెరైటీ వెరైటీ క్రాకర్స్ అందుబాటులో ఉండగా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.