వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 16: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కేసీఆర్ బర్త్‌డే వేడుక లు అంబరాన్నంటాయి. తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కేసీఆర్ బర్త్‌డే సంబరాలు రెండో రోజు అశేష జన వాహిని మధ్య ఆనందోత్సాహాలు, పటాకుల వెలు గుల మధ్య ఘనంగా సాగాయి. గురువారం ఉద యం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యా ర్థులు ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించడానికి తరలి వచ్చారు.
తెలంగాణ ఉద్యమాన్ని కల్లకు కట్టిన ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరి త్రను, సంక్షేమ పథకాల ఉద్దేశాలు, వాటి లక్ష్యాల ను గూర్చి తెలుసుకున్నారు. సాయంత్రం నిర్వ హించిన వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం జిగేల్ మంటున్న విద్యుత్ దీపాల మధ్యన పేరిణి, భరతనాట్య కళాకారులతో నృత్యకళా ప్రదర్శన, ఖవ్వాలీ కార్య క్రమాలతో పాటుగా జబర్దస్త్ కామెడీ షో ఫేమ్‌లు నరేశ్, నవీన్, తదితరులు వీక్షకులకు తమదైన ైస్టెల్లో మాటలు, పంచులతో మరింత ఉత్సాహాన్ని నింపారు.