Bhupalpally : అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేయండి.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్ : వరికి ప్రత్యామ్నాయంపై రైతులతో చర్చించండి.. అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. గురువారం భూపాలపల్లి మండలంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీలో యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో చర్చలు జరుపుతున్నారని, యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందనే నమ్మకం లేదన్నారు. ఈ సంవత్సరం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు.
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న చోట రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ఫాం పంట వేసుకోవచ్చని ఆయన సూచించారు. భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాలకు ఇంత వరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఉన్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో పనులు పెండింగ్ ఏంటని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి నీరు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్టారు.

మండల సమావేశానికి డీఈ రాకపోవడం ఏంటని, డీఈ రాకపోతే ఈఈ రావాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని, స్ట్రీట్ లైట్లకు ఆన్ఆఫ్ స్విచ్‌లు పెట్టకపోవడం, విరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. స్త్రీనిధి కింద అర్హులైన వారికి గేదెలను ఇవ్వాలని, నాగారంలో గేదెల పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు స్పందించి సరి చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలు తనిఖీ చేసి సౌకర్యాలు మెరుగుపరుచాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో అనిల్‌కుమార్, తాసిల్దార్ ఇక్భాల్, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణిశ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

