భద్రకాళీ శరణం మమ..

శాకంబరీ అలంకరణలో అమ్మవారు
ఆలయంలో నవరాత్ర మహోత్సవాలు సంపూర్ణం
చివరి రోజు తల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మట్టెవాడ, జూలై 24 : భద్రకాళీ శరణం మమ.. శాకంబరీ మాతాకీ జై అంటున్న భక్తుల నామస్మరణతో భద్రకాళీ ఆలయం మార్మోగింది. భద్రకాళీ శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. శనివారం అమ్మవారు శాకంబరీగా దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 72 రకాల 1200 కిలోల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన అలంకరణ 10గంటల వరకు సాగింది. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శాకంబరీ ఉత్సవాలకు సహకరించిన వివిధ శాఖలు, భక్తులకు ఆలయ ఈవో సునీత కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

