ఘనంగా మహిళా దినోత్సవం
హనుమకొండ, వరంగల్ జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి. నిట్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి ప్రారంభించారు. ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ మంజు శర్మ ప్రసంగించారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : హనుమకొండ, వరంగల్ జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి. నిట్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి ప్రారంభించారు. ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ మంజు శర్మ ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మహిళలదే కీలకపాత్ర అని ఉద్ఘాటించారు. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య మహిళా సాధికారతపై ‘ఓపెన్ మైక్’ సెషన్ నిర్వహించారు. అలాగే, హనుమకొండలోని తన కార్యాలయంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులను సన్మానించారు. అదనపు డీఎంహెచ్‌వో మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్ పాషా, పీవోడీటీటీ డాక్టర్ లలితాదేవి పాల్గొన్నారు. సుబేదారిలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. సొసైటీ చైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు. నర్సంపేటలోని ద్వారకపేట సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించారు. చెన్నారావుపేటలో ఆశా జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా అధికారులు, సంఘం నేతలను సన్మానించారు. ఖానాపురంలోని పీహెచ్సీలో వైద్యురాలు రుచిత, ఎంపీటీసీలు కవిత, భారతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కాశీబుగ్గ 18వ డివిజన్ తెలంగాణ జంక్షన్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. అలాగే, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, గైనకాలజిస్ట్ సుమిత్ర తిప్పని, ప్రతిమ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ తిప్పని అవినాష్, విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లను సీఐ మల్లయ్య సన్మానించారు.
ఇండస్ట్రీయల్ పార్కులో…
మడికొండ: మడికొండ శివారు ఇండస్ట్రీయల్ పార్కులోని తేజస్వి అపెరల్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ యజమాని కోడం సుకన్య, తాటికొండ లలిత, బండి రజిత, మామిడాల రజిత, ఇరుకుళ్ల ఉమారాణి, ఖాజాబీ, లక్ష్మి, నీరజ, నాగమణి, సువర్ణ, సరతి, అనూష, గీత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

