మనుమళ్ల చేతిలో తాత హతం
మనుమళ్లు తాతను వాకింగ్ స్టాండ్‌తో కొట్టి చంపిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80)కు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- ఆస్తి విషయంలో తరచూ తగాదాలు
- పాత కక్షలను మనసులో పెట్టుకొని హత్య
- హసన్‌పర్తిలో విషాదం
హసన్‌పర్తి, మే 19 : మనుమళ్లు తాతను వాకింగ్ స్టాండ్‌తో కొట్టి చంపిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80)కు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమారుడు చిన్నతనంలోనే చనిపోయాడు. పెద్ద కుమారుడు రమేశ్‌తోపాటు ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిగాయి. రమేశ్‌కు భార్య రమాదేవితోపాటు కుమారులు శశికుమార్(19), సాయికృష్ణ(22) ఉన్నారు.
రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం, నల్లా నీళ్లు, ఆస్తుల విషయంలో సారయ్య, కోడలు రమాదేవి, ఇద్దరు మనుమళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 గంటలకు నల్లా నీళ్లు పట్టుకునే విషయంలో మళ్లీ గొడవ జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకొని సారయ్యను కోడలు గట్టిగా పట్టుకోగా మనుమళ్లు వాకింగ్ స్టాండ్‌తో తాత తల, చేయిపై బలంగా కొట్టి పారిపోయారు. దీంతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సారయ్య కూతురు ల్యాగ తిరుమల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

