ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు సూచించారు.
- పార్టీ పటిష్టత కోసం శ్రేణులు పనిచేయాలి
- సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
- ప్రతి ఇంటి నుంచి తరలిరావాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరామ్ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన అమాత్యుడు
- 18 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
- పార్టీ కార్యకర్తలతో సమావేశం
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 7: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన 45రోజుల శ్రీరామ్ విజయోత్సవ ర్యాలీ, బంజారాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో 18 మంది బాధితులకు రూ.9లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈనెల 15 లేదా 20వ తేదీన మహబూబాబాద్‌లో తలపెట్టిన సీఎం పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలన్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, మెడికల్ కళాశాలతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం శ్రేణులు పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.20కోట్ల నిధులు మంజూ రు చేశారన్నారు. కుల సంఘాల భవనాలు, సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని చెప్పారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆగిన ఆసరా పెన్షన్లు త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. ఇస్కాన్ యాత్ర పాలకుర్తికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. పాలకుర్తి, తొర్రూరు మండలాల్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో నిత్యాన్నదానాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇస్కాన్ కోసం సన్నూరులో 10 ఎకరాల స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాలకుర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్నారు. పాలకుర్తి సోమనాథుడు, సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.20కోట్లు, బమ్మెర పోతనకు రూ.10 కోట్లు, వల్మిడి రామాలయ అభివృద్ధికి రూ.7కోట్ల నిధులు కేటాయించామని వివరించారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నానని, సంత్ సేవాలాల్ మహరాజ్ గుడితోపాటు ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు మహశ్రింగ దాస, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, చైర్మన్ వీ రాంచంద్రయ్య శర్మ, అర్చకులు డీవీఆర్ శర్మ, రామన్న శర్మ, లక్ష్మన్న శర్మ, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మండల రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ముస్కు రాంబాబు, ఎర్రబెల్లి రాఘవరావు, సేవాలాల్ కమిటీ అధ్యక్షుడు రవిరాథోడ్, జైసింగ్‌రాథోడ్, మాజీ ఎంపీపీ భూక్యా దల్జీత్ కౌర్, మూల వెంకటేశ్వర్లు, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్, జర్పుల బాలునాయక్, గంట భాస్కర్, నాయిని మల్లారెడ్డి, కారుపోతుల వేణు, పుస్కూరి రాజేశ్వర్‌రావు, పోగు శ్రీనివాస్, దూసరి గణపతి, చారగొండ్ల ప్రసాద్, నాగమల్ల సోమన్న, చీదర జగదీశ్, దొడ్డ వెంకన్న, కారుపోతుల వెంకటయ్య, పుస్కూరి కళింగరావు, లావుడ్యా మల్లునాయక్, గజ్జి సంతోశ్, కమ్మగాని నాగన్న, పాము శ్రీనివాస్, చారగొండ్ల సదానందం, చిక్కుడు రాములు, గిరగాని సుధ, పుట్ట ఉమాదేవి, జీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు: మండలంలోని ఫత్తెపురంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి బోనమెత్తారు. అనంతరం గుడిలో పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్య క్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ గూడెళ్లి సోమనర్సమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు రామసహాయం కిశోర్‌రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్ నాగవాణి, ఉప సర్పంచ్ ఇట్టే మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పసుమర్తి సీతారాములు, నలమాస పమోద్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

