తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్‌హక్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్‌కృష్ణ డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను (Telangana Activists) కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్‌హక్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్‌కృష్ణ ( Shyam Krishna) డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని, నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు.
ఉద్యమకారులకు సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో ఉద్యమ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి 2014 వరకు జరిగిన వివిధ దశల ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించేందుకు ఈనెల 5న కాకతీయకాలనీలోని తెలంగాణ ఉద్యమకారు ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఛైర్మన్ ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బోరిశెట్టి అశోక్, ఏ.రమేశ్, ఎరం మనోహర్‌రావు, చెన్నూరి నటరాజ్, మోగుసాల దేవేందర్, మెర్జా అమ్జద్బేగ్, రాంపెల్లి శ్రీనివాసచారి, జక్కుల స్వామి, బైరి రమేశ్, దారా సూరి, వంగపండ్ల రవియాదవ్, అరికె రాంకుమార్, లింగపెల్లి సంపత్‌రావు, సౌరం స్వర్ణలత, కుంటి పద్మ, బొల్లు లక్ష్మీ, కుంటి నవ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

