ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? అందుకోసం ఏ కాలేజీలో చేరాలి? ఎక్కడ ప్రవేశం పొందితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఇంటర్ పూర్తయ్యే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో అటు విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పాటు పిల్లలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, కలలను నిజం చేసే సువర్ణావకాశం వారి ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై ‘నమస్తే తెలంగాణ-కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా జనగామ జిల్లాకేంద్రంలోని ఎస్ఎస్ఎన్ గార్డెన్లో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు.
-జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 27
కెరీర్ గైడెన్స్ సదస్సుకు విశేష స్పందన వచ్చింది. వక్తల సూచనలు, సలహాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, బీబీఏ వంటి కోర్సులు తీసుకుంటే వచ్చే అవకాశాల గురించి ఈ సందర్భంగా వక్తలు వివరించారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం జీవితంలో సక్సెస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే మున్ముందు జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు.
ఎంపీసీ తర్వాత ఏఐ, ఏఐ డేటా సైన్స్ వంటి కోర్సులకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉన్నదన్నారు. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ గురించి సవివరంగా అవగాహన కల్పించారు. సుమారు 90 కంపెనీలు అందిస్తున్న ప్లేస్‌మెంట్స్‌తో పాటు పర్ యానమ్ మినిమమ్, మాగ్జిమమ్, హయస్ట్ రేంజ్లో ఇస్తున్న ప్యాకేజీల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతేగాక కేఎల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కాలర్షిప్ పొందే అవకాశం ఉన్నదన్నారు.
కేఎల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి సెల్ నంబర్ 7997995708లో సంప్రందించాలని సూచించారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన నలుగురు విద్యార్థులకు మెడల్స్, మెమొంటోలతో పాటు సదస్సుకు హాజరైన విద్యార్థుల్లో ఒకర్ని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి రిస్ట్ వాచ్‌ను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ మేనేజర్లు బి.నవీన్, ఎం.ప్రవీణ్, నమస్తే తెలంగాణ ఏడీవీటీ వరంగల్ యూనిట్ డిప్యూటీ మేనేజర్ అప్పని సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పూర్తయిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కేఎల్ యూనివర్సిటీ భరోసా కల్పిస్తుంది. ఒకే చోట అనేక కోర్సులను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ ఇది. ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ఇవాళ యూఎస్ఏ, యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించి వారి లక్ష్యాన్ని చేరుకున్నారు. బెస్ట్ కాలేజీ, బెస్ట్ కోర్సు, బెస్ట్ ప్లేస్మెంట్, బెస్ట్ ప్యాకేజీ పొందేందుకు విద్యార్థులకు కేఎల్ వర్సిటీ ప్రస్తుతం అన్ని రకాలుగా అందుబాటులో ఉంది. తమ కలలను నిజం చేసుకునేందుకు కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు అనువైన వేదిక.
– డాక్టర్ కే శ్రీనివాస్, ప్రొఫెసర్ కేఎల్ యూనివర్సిటీ
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి కేఎల్ యూనివర్సిటీ ఒక మార్గం. ఈ సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీసుకునే సరైన నిర్ణయం భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. ఏఐ, ఏఐ డేటా సైన్స్ వంటి కోర్సుల ఎంపిక, మంచి కళాశాలలో చేరికను బట్టి ప్లేస్మెంట్లు దొరుకుతాయి. విద్యాసంస్థలో కల్పిస్తున్న వసతులు, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్పై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. దానికి కేఎల్ యూనివర్సిటీ గొప్ప మార్గదర్శి. చదువే కాదు క్రీడలు, యోగా కూడా విద్యార్థులకు ఒక భాగంగా ఉండాలి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇది కృషిచేస్తుంది.
– కే మాధవీ లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేఎల్ యూనివర్సిటీ
ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎక్కడ చేరాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను ఉజ్వలంగా మార్చేందుకు ముందుకొచ్చిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు. కెరీర్ గైడెన్స్‌పై సరైన అవగాహన ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉత్తమ కోర్సులను ఎంపిక చేసుకునేందుకు ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది.
– కే కనకరాజు, ప్రిన్సిపాల్ ఏబీవీ జూనియర్ కళాశాల
ఈ కెరీర్ గైడెన్స్ తర్వాత నాలో నమ్మకం మరింత పెరిగింది. జీవితంలో గొప్పగా స్థిరపడాలంటే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలని వక్తలు వివరించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రపంచ దేశాల్లో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన ప్లేస్‌మెంట్స్, పొందుతున్న ప్యాకేజీలు నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఇంకా బాగా పట్టుదలతో చదువుతా. మా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకొస్తా.
– కే రాకేశ్, విద్యార్థి
ఇంటర్ తర్వాత కామన్‌గా అందరు చదివే కోర్సులు కాకుండా ఏఐ, ఏఐ డాటా సైన్స్ వంటి కొత్త కోర్సులను పరిచయం చేశారు. ఆ కోర్సులో చేరాలని నాకు ఆసక్తిగా ఉంది. జీవితంలో బాగా ఎదగాలంటే మంచి లైఫ్ ఉన్న కోర్సును, కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలని అర్థం అయ్యింది. ఇక నుంచి మంచి ప్రణాళికతో చదువుతా. ఉత్తమ ఫలితాలను సాధిస్తా.
– జే భార్గవి, విద్యార్థిని
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి విద్యార్థి గొప్ప కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవాలి. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. కేఎల్ యూనివర్సిటీ-నమస్తే తెలంగాణ కెరీర్ గైడెన్స్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.
– పందిళ్ల అశోక్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్
ఈ కెరీర్ గైడెన్స్‌తో నాకు ఇప్పటి వరకున్న సందేహాలు తీరాయి. ఇంటర్ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. మా తల్లిదండ్రులతో మాట్లాడి కేఎల్ యూనివర్సిటీ కళాశాలలో బీటెక్‌లో చేరుతా. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలనే నా కోరికను నిజం చేసుకుంటా. థ్యాంక్స్ టూ కేఎల్ యూనివర్సిటీ అండ్ నమస్తే తెలంగాణ.
– కే పావని, విద్యార్థిని
ఈ కేరీర్ గైడెన్స్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ తర్వాత ఏం చదవాలన్న ప్రశ్నకు సమాధానంగా కేఎల్ యూనివర్సిటీ-నమస్తే తెలంగాణ అవగాహన సదస్సు ఎంతో ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదెంతో మేలు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా సరికొత్త కోర్సులు ఇవాళ విద్యార్థులకు పరిచయం చేశారు. వాటితో ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.
– శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల