హసన్‌పర్తి, ఏప్రిల్ 10: భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళ లకు టైలరింగ్, బ్యూటీపార్లర్‌లో 30 రోజులపాటు శిక్షణ ఇవ్వ నున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల వారు 4 పాస్‌ఫోర్టు సైజు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధా ర్ కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలను తీసుకొని ఎస్బీ ఐ ఆర్ఎస్ ఈటీఐ, సంస్కృతి విహార్ టీటీడీసీ హసన్‌పర్తి, హ నుమకొండ జిల్లా-506371 అడ్రస్‌లో ఈ నెల 14వ తేదీలో గా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9704056522, 9849307873, 6281260878, 9949108934 నంబర్లలో సంప్రదించాలని కోరారు.