వరంగల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ తక్కలపెళ్లి సురేందర్ రావు (68) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే టి రాజేశ్వరరావు సోదరుడు. గురువారం తన ఇంట్లో సురేందర్ రావు విగతజీవిగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీల పరిశీలిస్తున్నారు.