పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు అంతా సిద్ధమయ్యారు. ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి 12 అవుతుందా.. న్యూ ఇయర్ 2023కి గ్రాండ్ వెల్కమ్ చెబుదామా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్లాన్లు వేసుకుంటూ.. ‘సెలబ్రేషన్స్’ ఏర్పాటు పనుల్లో బిజీ అయిపోయారు. ముఖ్యంగా యువత ఆటాపాటలతో ఎంజాయ్ చేసేందుకు ఫుల్ జోష్‌తో ఉన్నారు. అలాగే కొత్త వేడుకలను ఆస్వాదించేందుకు నగరంలో పలుచోట్ల మిమిక్రీ, కామెడీ షో, డ్యాన్స్‌లతో మ్యూజికల్ నైట్ షోలు ఏర్పాటుచేస్తుండగా డిసెంబర్ 31, జనవరి 1 కోసం పలు వ్యాపారసంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
– హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30
కొత్త సంవత్సర సంబురాల్లో మునిగిపోయేందుకు నగర ప్రజలు రెడీ అయ్యారు. ఇందుకోసం సెలబ్రేషన్ జరుపుకొనేందుకు వేదికలను ఎంచుకొని పార్టీలతో ఎంజాయ్ చేయనున్నారు. డ్యాన్సులు, పాటలతో ఎంజాయ్ చేస్తూ న్యూఇయర్‌ను స్వాగతించనున్నారు. రోజంతా ఎలా ఎంజాయ్ చేయాలని ముందస్తుగా ప్రణాళికలను తయారు చేసుకుంటున్నారు. గతం కంటే ఈసారి ఫుల్ జోష్‌ను ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దాబాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు బిజీగా కనిపించనున్నాయి. కొందరు స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకొనేందుకు సిద్ధం కాగా.. మరికొందరు ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గడిపేందుకు ఇష్టపడుతున్నారు.
హుషారెత్తించే పాటలతో..
పాటలు, నృత్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించనున్నారు. హుషారెత్తించే పాటలతో డీజేలు మోగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీల్లో మునిగి తేలనున్నారు. యువత కేరింతలతో.. హుషారెత్తించే పాటలతో డిసెంబర్ 31ని ఎంజాయ్ చేయనున్నారు. ముందుగా తమకిష్టమైన వారికి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసే రోజు రానేవచ్చింది. కొందరు ఇళ్ల వద్ద డీజేలు మోగించనున్నారు. ఆటాపాటలతో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయనున్నారు.
ఆఫర్లే ఆఫర్లు..
వినియోగదారులను ఆకట్టుకునేందుకు నగరంలోని పలు వ్యాపార సముదాయాలు కొత్త ధోరణిని అవలంబిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో ని పలు సంస్థల వారు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దుస్తుల నుంచి మొదలుకొని బిర్యానీ వరకు న్యూఇయర్ పేరిట ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కేకులకు భలే గిరాకీ ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అర్ధరాత్రి 12గంటల తర్వాత కేక్ కట్ చేసేందుకు ఉత్సాహపడుతుంటారు. ఇందుకోసం బేకరీ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో కేకు తయారీకి సిద్ధమవుతున్నారు. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ఆయా బేకరీ యజమానులు రూ.120కే కిలో కేక్ ఆఫర్ పెట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో సుమారు ఐదు వేల కేకు లు సేల్ అవుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
అలరించనున్న మ్యూజికల్ నైట్ షోలు..
నగరంలో పలుచోట్ల మ్యూజికల్ నైట్ షో అందరినీ అలరించనున్నది. వరంగల్‌లోని మ్యూజికల్ గార్డెన్, హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం, పబ్లిక్‌గార్డెన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మిమిక్రీ, కామెడీ షో, డ్యాన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు. పిల్లలతో బయటికి వెళ్లి సరదా గడిపే వారి కోసం ఈ నైట్ షోలు దోహదపడతాయి. అంతేగాక కళాశాలలు, హాస్టళ్టలో విద్యార్థులు సంబరాలు మిన్నంటనున్నాయి.
బిర్యానీకి కూల్‌డ్రింక్ ఫ్రీ..
నగరంలోని పలు బిర్యానీ పాయింట్లలో ఆఫర్లను ఏర్పాటు చేశారు. భోజన ప్రియుల కోసం ప్రత్యేకంగా ఆఫర్లు పెట్టారు. కూల్‌డ్రింక్స్ కంపెనీల సహకారంతో మరింత ఉత్సాహంగా జరుపుకోనున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి హాఫ్ లీటర్ కూల్‌డ్రింక్ ఉ చితంగా ఇవ్వనున్నారు. అటు మందుబాబులు, భోజన ప్రియు ల కోసం బిర్యానీ సహా కొత్త వెరైటీలను ఆఫర్ చేస్తున్నారు. బిర్యానీ పాయింట్లలో నెలరోజులకు వచ్చే ఆదాయం ఒక్కరోజే వస్తుందని పలుషాపుల యాజమానులు చెబుతున్నారు.