మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం రాత్రి సందర్శించారు
- ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి
- విద్యార్థులకు ఎమ్మెల్యే గండ్ర సూచన
- భూపాలపల్లి మైనార్టీ గురుకులం సందర్శన
- వజ్రోత్సవాల్లో భాగంగా రాత్రి నిద్ర
- ఉదయాన్నే విద్యార్థులతో కలిసి రన్నింగ్, యోగా, నమాజ్
భూపాలపల్లి రూరల్, ఆగ స్టు 14: మహనీయుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం రాత్రి సందర్శించారు. పాఠశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి బుర్ర సునీత, పాఠశాల ప్రిన్సిపల్ రజితను అభినందించారు.
ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల చరిత్ర ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. చదువుకునే దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని, ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని సూచించారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించిన ఆయన ఆదివారం ఉదయం విద్యార్థులకు సోప్ కిట్లను పంపిణీ చేశారు. కలిసి ఎమ్మెల్యే రన్నింగ్, యోగా, నమాజ్ చేశారు. వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బుర్ర రమేశ్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

