నేడు మేడారంలో సీఎం పర్యటన
మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
ములుగు, సెప్టెంబర్22(నమస్తేతెలంగాణ)/తాడ్వాయి : మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్నవాగులో పుణ్యస్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. 1.30 గంటల వరకు మేడారం గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పూజారులతో కలిసి పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించనున్నారు. భోజన విరామం అనంతరం 2.30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయా ణం కానున్నారు. కాగా, సీఎం వెంట రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ, లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి రానున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ మహేందర్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయలతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరిశీలించారు. హెలిప్యాడ్‌తో పాటు గద్దెల వద్దకు ముఖ్యమంత్రి వచ్చే మార్గాన్ని, తల్లులను దర్శించుకునేందుకు చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

